/rtv/media/media_files/2025/07/12/vinutha-driver-murder-case-2025-07-12-17-42-13.jpg)
Vinutha Driver Murder Case
Vinutha Driver Murder Case: శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ వినూత డ్రైవర్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో మిస్టరీ వీడింది. డ్రైవర్ హత్యకు అసలు కారణం ఏంటో పోలీసులు వెల్లడించారు. రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు. డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడును శ్రీకాళహస్తిలోనే హత్య చేసిన నిందితులు చెన్నై శివారు కాలువలో పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసులో జనసేన నాయకురాలు వినూత, ఆమె భర్త చంద్రబాబు, గోపి, శివకుమార్, షేక్ థాసన్ లను అరెస్ట్ చేశామని చెన్నై పోలీసులు వివరించారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING : మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!
శ్రీకాళహస్తి ఘటనపై చెన్నై నగర పోలీస్ కమిషనర్ అరుణ్ మీడియాతో మాట్లాడారు. ”సెవెన్ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలువ వద్ద నాలుగు రోజుల క్రితం మాకు ఒక మృతదేహం లభించింది. ఈ నెల 8న చెన్నైలోని ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డ్ వెనుక కూవం నది కాలువలో రాయుడు మృతదేహాన్ని పడవేసినట్లు పోలీసులు గుర్తించారన్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులు కారులో శవాన్ని తీసుకువచ్చి అక్కడ పడేసినట్లు గుర్తించామన్నారు. కారు వివరాల ఆధారంగా నిందితుల వివరాలను గుర్తించామని తెలిపారు. మృతుడు రాయుడు ఒంటిపై జనసేన గుర్తుతో పాటు వినూత పేరుతో పచ్చబొట్టు ఉందని, దాని ఆధారంగా కూఫీ లాగితే వివరాలు అన్ని బయటకు వచ్చాయని వెల్లడించారు. తద్వారా ఐదుగురిని అరెస్ట్ చేశాం. జనసేన పార్టీకి చెందిన వినూతతో పాటు మొత్తం ఐదుగురు ఈ హత్యలో పాల్గొన్నారని వివరించారు. వారు నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి:Prakash Raj : ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ !
కాగా, వినూత దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న రాయుడు తమ రాజకీయ ప్రత్యర్థులకు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆ కారణంగానే రాయుడును డ్రైవర్ తొలగించినట్లు ప్రకటించారు. అయితే అదే క్రమంలో రాయుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. అనంతరం చెన్నైలో శవాన్ని పడేశారు. అయితే వైద్య అవసరాల కోసం నిందితులు తరచుగా చెన్నైకి వచ్చేవారని, కనుక ఆ రూటుపై అవగాహన ఉండటంతో మృతదేహాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి పడేశామని నిందితులు చెబుతున్నారని చెన్నై నగర పోలీస్ కమిషనర్ అరుణ్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి:BIG BREAKING: నెల్లూరు జిల్లా కోవూరులో కలకలం.. మీటింగ్ లోనే పురుగుల మందు తాగిన టీడీపీ కార్యకర్త!