Crime: మరో దారుణం.. బావతో కలిసి భర్తను చంపిన భార్య

ఇటీవల ఢిల్లీలో కరన్ దేవ్ అనే వివాహితుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.అతడి భార్య సుస్మిత.. ఆమె బావ రాహుల్‌తో కలిసి భర్తను హత్య చేసినట్లు తేలింది.

New Update
Woman, Brother-In-Law Have An Affair, Kill Husband Using Sleeping Pills

Woman, Brother-In-Law Have An Affair, Kill Husband Using Sleeping Pills

ఇటీవల ఢిల్లీలో కరన్ దేవ్ అనే వివాహితుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. అతడు ఎలక్ట్రిక్ షాక్‌ తగిలి చనిపోయినట్లు తన భార్య సుస్మిత ఆరోపించింది. దీనిపై రంగంలో దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. భార్య  సుస్మిత.. తన బావతో కలిసి భర్తను హత్య చేసినట్లు తేలింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జులై 13న కరన్‌ దేవ్‌ను ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తీసుకొచ్చారు. తన భర్తకు ఎలక్ట్రిక్‌ షాక్‌ తగిలినట్లు ఆమె వైద్యులకు చెప్పింది. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 

కరన్ దేవ్‌ షాక్‌ తగిలి చనిపోయాడని భావించిన అతడి కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిర్వహించేందుకు ఒప్పుకోలేదు. కానీ ఢిల్లీ పోలీసులు మాత్రం అతడి వయస్సు, మృతిపై అనుమానాలు రావడంతో పోస్టుమార్టం నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు. కానీ కరన్ దేవ్ భార్య సుస్మిత, ఆమె బావ రాహుల్‌ దీనికి అభ్యంతరం తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కరన్‌ దేవ్ సోదరుడు పోలీసులకు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. సుస్మిత, ఆమె బావ రాహుల్ కలిసి తన అన్న కరన్‌దేవ్‌ను హత్య చేశారని ఆరోపించాడు. అంతేకాదు సుస్మిత, రాహుల్ మర్టర్‌ ప్లాన్‌ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసుకున్న చాటింగ్‌ను కూడా చూపించాడు. 

Also Read: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లెందుకు.. BCCIపై శివసేన ఎంపీ ఫైర్

Also Read :  ఐ లవ్ యూ.. అమ్మా అంటూ.. ప్రాణం తీసుకున్న యువకుడు

Wife Kill Husband Using Sleeping Pills

ఆ చాట్స్‌లో సుస్మిత, రాహుల్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడింది. అందుకే వాళ్లిద్దరూ కలిసి కరన్‌కు హత్య చేయాలని నిర్ణయించి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇందుకోసం రాత్రి డిన్నర్‌కు కరన్‌కు వాళ్లు 15 స్లీపింగ్‌ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లేవరకు ఎదురుచూశారు. అంతేకాదు సుస్మిత, రాహుల్‌.. స్లిపింగ్‌ పిల్స్‌ ఎక్కువగా తీసుకుంటే చనిపోయేందుకు ఎంత సమయం పడుతుందనేది కూడా గుగుల్‌లో వెతికినట్లు ఇన్‌స్టా చాట్‌లో బయటపడింది. 

అయితే కరన్‌ అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ శ్వాస ఉంది. దీంతో సుస్మిత, రాహుల్‌ ఇద్దరూ కలిసి కరన్‌కు ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇచ్చారు  అతడు ఎలక్ట్రిక్ షాక్‌తో మరణించినట్లు నమ్మించారు. చివరికి పోలీసులు విచారణలో కరన్ సోదరుడు అసలు విషయం బయటపెట్టడంతో వాళ్ల బండారం బయటపడింది. వాళ్లిద్దరినీ అదపులోకి తీసుకొని విచారించగా.. సుశ్మిత తన బావ రాహుల్‌తో కలిసి భర్తను చంపినట్లు ఒప్పుకుంది. 

Also Read: కేంద్రం గుడ్‌న్యూస్.. వాళ్లకు నెలకు రూ.50 వేల ఆర్థిక సాయం

అయితే కరన్‌ తనను కర్వాచౌత్‌ వేడుకకు ముందురోజు చెంపదెబ్బ కొట్టాడని, హింసించాడని ఆరోపించింది. అలాగే డబ్బులు కోసం తరచు ఆమెను వేధించేవాడని.. దీనివల్ల తాను మానసిక, శారీరక బాధకు గురైనట్లు పేర్కొంది. చివరికి వాళ్లిద్దరిపై ఆయా సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కరన్ పోస్టుమార్టం రిపోర్ట్‌ కోసం ఎదురుచూస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ద్వారకా అంకిత్ సింగ్ తెలిపారు. 

Also Read :  డైనోసార్‌ అస్థిపంజరానికి వేలంలో రూ.260 కోట్లు

national-news | murder | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు