TG Crime : తల్లి పుట్టిన రోజునే యువకుడి హత్య
తన తల్లి పుట్టినరోజే ఆ యువకుడికి చివరిరోజు అయ్యింది. తల్లి బర్త్ డేను స్నేహితులతో కలిసి చేసుకుందామని వెళ్లిన యువకున్ని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. యువకుడి వద్ద ఉన్నడబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నిరాకరించడమే ఆ యువకుడికి శాపమైంది.