America: అమెరికాలో దారుణం.. యూరిన్ వద్దన్నందుకు భారతీయుడిని కాల్చి చంపిన దుండగుడు

అమెరికాలోని కాలిఫోర్నియాలో పబ్లిక్‌లో యూరిన్ వద్దన్నందుకు కపిల్ అనే భారతీయుడిని కనీసం ఆలోచించకుండా ఓ దుండగుడు గన్ తీసి కాల్చి చంపేశాడు. ఒక్కగానొక్కొ కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.

New Update
Haryana

Haryana Photograph: (Twitter)

అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పబ్లిక్‌(Public) లో యూరిన్(Urine) వద్దని చెప్పినందుకు భారతీయుడిని ఓ దుండగుడు దారుణంగా కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. హర్యానా రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల యువకుడు కపిల్‌ కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. అయితే పబ్లిక్‌లో ఓ అమెరికన్ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇలా చేయవద్దని చెప్పడంతో స్పాట్‌లోనే ఆ దుండగుడు గన్ బయటకు తీసి దారుణంగా కాల్చి వెళ్లిపోయాడు. దీంతో కపిల్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read :  అమెరికాలో ఉండేవారికి బిగ్‌షాక్.. అలా చేస్తే బహిష్కరణే

భవిష్యత్తులో స్థిర పడాలని..

ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో గుండెలు పగిలేలా తల్లిదండ్రులు రోధిస్తున్నారు. కపిల్ హర్యానా(Haryana) లోని జింద్ జిల్లాలోని బరా కలా గ్రామానికి చెందినవాడు. పై చదువుల కోసం అప్పు చేసి 2022లో అమెరికా వెళ్లాడు. కపిల్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. పేదరికంలో పుట్టిన కపిల్.. దీన్ని దూరం చేసేందుకు అమెరికా వెళ్లాడు. కష్టపడి చదివి మంచి జాబ్‌తో భవిష్యత్తులో స్థిరపడాలని రూ.45 లక్షలు ఖర్చు చేసి మరి అమెరికా వెళ్లాడు. కానీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. 

ఆ అమెరికన్ వ్యక్తికి కపిల్ శుభ్రత కోసం తెలియజేశాడు. ఒక బాధ్యత గల పౌరుడిగా మన చుట్టూ ఉండే ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ ఉద్దేశంతోనే కపిల్ అమెరికన్ వ్యక్తికి చెప్పాడు. కానీ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా జేబులో ఉన్న తుపాకీ తీసి కాల్చివేశాడు. ఈ దారుణ ఘటన జరిగిన వెంటనే కపిల్‌ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అమెరికా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కపిల్ మృతదేహం ఎలాగైనా ఇండియాకు తీసుకురావాలని అతని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. 

ఇది కూడా చూడండి:  భారత్‌కు వ్యతిరేకంగా జెలెన్‌స్కీ.. అమెరికాకు సపోర్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు