TG Crime : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
వివాహితతో సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తి ఆమె భర్త చేతిలో హతమయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన అడికేవారి రమేష్ హత్యకు గురయ్యాడు.
వివాహితతో సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తి ఆమె భర్త చేతిలో హతమయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన అడికేవారి రమేష్ హత్యకు గురయ్యాడు.
విజయవాడ గవర్నర్ పేటలో క్యాటరింగ్ చేసే ఇద్దరు యువకులను రౌడీ షీటర్ కిషోర్ దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నారు.
ముంబైలో ఓ సవతి తండ్రి నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి చంపి ఆ తర్వాత మృతదేహం సముద్రంలో పడేశాడు. కూతురు కనిపించడం లేదని తల్లి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. దంపతుల వ్యవహారంపై పెద్దమనుషుల పంచాయితీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వివాదం ముదిరి ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడులకు దిగాయి.
అస్సాంలోని గువాహటిలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. 38 ఏళ్ల మహిళ తన భర్తను హత్య చేసి, ఇంటి ఆవరణలోనే పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. జాయ్మతి నగర్, పండు ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన జూన్ 26న చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మొహల్లా ప్రాంతానికి చెందిన తాజోద్దీన్ను దుండగులు హత్య చేసి బావిలో పడేశారు. మసీదు నుంచి తాజోద్దీన్ను ఇద్దరు వ్యక్తులు బైక్పై ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఆదివారం అతడి మృతదేహాన్ని గుర్తించారు.
శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జనసేన నేత వినుత దంపతులు ఈరోజు చెన్నై కోర్టు ఆవరణలో సంచలన ఆరోపణలు చేశారు. హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారని చెప్పారు.
శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ వినూత డ్రైవర్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో మిస్టరీ వీడింది. డ్రైవర్ హత్యకు అసలు కారణం ఏంటో పోలీసులు వెల్లడించారు. రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు.
ఏపీలోని ధర్మవరంలోని ముదిగుబ్బలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విశ్వనాథ్ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మామే అల్లుడిని రూ.4 లక్షలకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా విచారణలో తేలింది.