Charlie Kirk Murder: కొడుకును పట్టిచ్చిన తండ్రి..చార్లీ కిర్క్ మర్డరర్ టైలర్ రాబిన్సన్ కేసులో కీలక మలుపు

చార్లీ కిర్క్ ను చంపిన నిందితుడు తమ కస్టడీలో ఉన్నాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అతనిని చాలా దగ్గర వ్యక్తే పట్టిచ్చారని తెలిపారు. నిందితుడు 22 ఏళ్ళ టైలర్ రాబిన్సన్ కాగా..అతనిని తండ్రి మ్యాట్ యే పట్టిచ్చాడని సమాచారం.

New Update
matt

charlie kirk murder suspect Tylor Raboinson

కొడుకు నేరం చేసినవాడే అయినా...తండ్రి మాత్రం నిజాయితీకి మారు పేరు. చట్టాలను గౌరవించేవాడు. కొడుకు తప్పు చేశాడని తెలిసి కడుపులో దాచుకోలేదు. డైరెక్ట్ గా ప్రభుత్వంతో మాట్లాడా అతడిని అప్పగించాడు. ఇది చార్లీకిర్క్ ను చంపాడని అనుమానిస్తున్న టైలర్ రాబిన్సన్, అతని తండ్రి మ్యాట్ రాబిన్సన్ కథ. తన కొడుకే చార్లీని హత్య చేశాడని తండ్రి మ్యాట్ తెలుసుకున్నాడు. దాన్ని అతను కప్పిపుచ్చాలని ప్రయత్నించలేదు. డైరెక్ట్ గా ఒక మంత్రితో సంప్రదింపులు జరిపి కొడుకు టైలర్ పట్టుబడేలా ప్లాన్ చేశారు. రెండు రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు టైలర్...తండ్రి మ్యాట్ నుంచి మాత్రం తప్పించుకోలేక పోయాడు.

తండ్రి పోలీస్..కొడుకు హత్యా నేరం నిందితుడు..

మ్యాట్ లా ఎన్ ఫోర్స్ మెంట్ లో పని చేశారని తెలుస్తోంది. ఈయన వాషింగ్టన్ కౌంటీషెరీఫ్డిపార్ట్ మెంట్ లో 27 ఏళ్ళు పని చేశారని చెబుతున్నారు. టైలర్ తన తండ్రి దగ్గర నిజాన్ని ఒప్పుకొన్నాడని తెలుస్తోంది. మ్యాట్ స్వతహాగా ఒ పోలీస్ అవ్వడం వల్లనే తన కొడుకే నిందితుడు అని తెలియగానే డైరెక్ట్ గా అతన్ని పట్టుకుని యూఎస్ మార్షల్స్ కు అప్పగించారని చెబుతున్నారు. ప్రస్తుతం మ్యాట్ కూడా పోలీసులతోనే ఉన్నారని సమాచారం. టైలర్ రాబిన్సన్ ఫోటోను విడుదల చేసిన కొనని గంటల్లోనే ఈ పరిణామాలన్నీ జరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హైలెట్ అవుతోంది. మ్యాట్ ను అభినందిస్తూ చాలా మంది పోస్ట్ లు పెడుతున్నారు. తప్పు చేసిన కొడుకును అప్పగించి మ్యాట్ రాబిన్సన్ ఆదర్శ వ్యక్తిగా నిలిచారని పొగుడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు