Uttarpradesh: యూపీలో దారుణం.. చికెన్ వండలేదని భార్యను అతికిరాతంగా.. ఏం చేశాడంటే?

చికెన్ కర్రీ వండలేదని భార్యను అతికిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అయితే భార్యను చంపిన తర్వాత మిస్సింగ్ కేసు కిందట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
Uttarpradesh

Uttarpradesh

నేటి కాలంలో చిన్న విషయాలకు కూడా భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. క్షణికావేశంలో కోపానికి గురై భాగస్వామిని దారుణంగా హత్య చేసిన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా యూపీలోనూ ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో 21 ఏళ్ల రీనా అనే యువతికి వివాహం జరిగింది. అయితే ఇంట్లో చికెన్ వండకుండా వెజ్ కర్రీ వండినందుకు ఓ భర్త భార్యపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ క్రమంలో ఆ భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది చికెన్ వండలేదని కాదని, వరకట్న హత్య అని కుటుంబ సభ్యులు అంటున్నారు. కావాలనే భర్త ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: హైదరాబాద్‌లో పట్టపగలే దారి దోపిడి.. 40 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు!

భార్యను చంపి కేసును తప్పుదోవ పట్టించి..

భార్యను చంపిన తర్వాత నిగమ్ బంధువుల సహాయంతో రీనా మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి మట్టితో నింపి, గంగానదిలో పడేశాడు. దీని తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతనిపై వరకట్న హత్య కేసు నమోదు చేశారు. నిగమ్‌తో పాటు అతని బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కఠిన శిక్ష విధించాలని బాధితరాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Ganesh Immersion Accident: షాకింగ్ వీడియో.. గణేష్ నిమజ్జనంలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 9 మంది స్పాట్ డెడ్

Advertisment
తాజా కథనాలు