Bihar Assembly Elections : బీహార్‌లో ఆర్జేడీ నాయకుడు రాజ్‌కుమార్‌ రాయ్‌ హత్య

బీహార్ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నాయకుడు రాజ్‌కుమార్ రాయ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడంతో కలకలం రేగింది.

New Update
Bihar Assembly Elections

Bihar Assembly Elections

బీహార్(Bihar) రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నాయకుడు రాజ్‌కుమార్ రాయ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడంతో కలకలం రేగింది. పాట్నాలోని మున్నాచక్‌లో జరిగిన ఈ ఘటన రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న రాయ్ ఆశలకు గండి కొట్టింది. పట్నాలోని రాఘోపూర్‌ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరఫున పోటీ చేసేందుకు రాయ్‌ సిద్ధమయ్యారు. ఈక్రమంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి అతిసమీపం నుంచి రాయ్‌పై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు.  

RJD Leader Murdered In Bihar

ఇది కూడా చదవండి: ముసలోడు కాదు...మూర్ఖుడు..11 ఏళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

ఈ సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాయ్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య జరిగిన ప్రాంతంలో ఆరు బుల్లెట్ షెల్స్‌ లభ్యమయ్యాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, భూవివాదమే ఈ హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. రాయ్‌కు రియల్ఎస్టేట్‌ వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కాగా.. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections)   జరగనున్న వేళ ఈ హత్య తీవ్ర దుమారం రేపుతోంది.

హత్యకు గురైన ఆర్‌జేడీ నేత రాజ్‌కుమార్ రాయ్(RJD Rajkumar Roy) రాబోయే ఎన్నికల్లో రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించారని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే కాల్పుల తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో బిహార్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడి వెనుక భూ వివాదాలు కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. రాజ్‌కుమార్ రాయ్ భూ సంబంధిత వ్యాపారాల్లో చురుగ్గా పాల్గొనేవారని పోలీసులు తెలిపారు.  

Also Read : ఛీఛీ వెధవలు.. 16 ఏళ్ల బాలుడ్ని రేప్ చేసిన మరో మైనర్, యువకుడు.. వీడియో తీసి..

Advertisment
తాజా కథనాలు