Crime: దారుణం.. అమెరికాలో భారతీయుడి తల నరికిన దుండగుడు

ఈమధ్య అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తులు అకాల మరణం చెందుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా డాలస్‌ నగరంలో ఓ మోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్య(50) అతని సహోద్యోగే కత్తితో నరికి చంపేశాడు.

New Update
Indian-Origin Motel Manager Beheaded in US

Indian-Origin Motel Manager Beheaded in US

ఈమధ్య అమెరికా(usa) లో భారత సంతతికి చెందిన వ్యక్తులు అకాల మరణం చెందుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ముష్కరులు కాల్పులు తదితర ఘటనల్లో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. తాజాగా డాలస్‌ నగరంలో ఓ మోటల్‌లో మేనేజర్‌(Motel Manager) గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్య(50) అతని సహోద్యోగే కత్తితో తల నరికేయడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. మోటల్‌ మేనేజర్‌ నాగమల్లయ్య వద్ద మార్టినెజ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు.

Also Read: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి నలుగురు స్పాట్ డెడ్

Indian-Origin Motel Manager Beheaded In US

అయితే బుధవారం మల్లయ్య, మార్టినేజ్‌ మధ్య ఓ విషయంపై గొడవ జరిగింది. మార్టినెజ్‌ మోటల్‌లో గదిని శుభ్రం చేస్తున్నాడు. విరిగిపోయిన వాషింగ్‌ మెషీన్‌ను వాడొద్దని నాగమల్లయ్య చెప్పాడు. కానీ ఈ విషయాన్ని అతడు డైరెక్ట్‌గా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగితో చెప్పించాడు. దీంతో మార్టినెజ్‌ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంలో వీళ్లద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆవేశంతో ఊగిపోయిన మార్టినెజ్‌ మల్లయ్యను కత్తితో పలుమార్లు పొడిచాడు. 

Also Read: అధ్యక్షుడు ఒకలా..వాణిజ్య మంత్రి మరొకలా..రష్యా చమురు కొనుగోలు ఆపితేనే చర్చలని ప్రకటన

మల్లయ్య పారిపోయేందుకు ప్రయత్నించినా కూడా వెంటాడి మరి అతడి తల నరికేశాడు మార్టినెజ్‌. ఆ తర్వాత తలను చెత్తకుప్పలో పడేశాడు. ఆ దాడిని ఆపేందుకు మల్లయ్య కుటింబీకులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి ఈ హత్యపై భారత కాన్సులేట్‌ కూడా ఎక్స్‌లో స్పందించింది. ''మల్లయ్య హత్య దిగ్ర్భాంతికి గురిచేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వాళ్లకి సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని'' వెల్లడించింది.

Advertisment
తాజా కథనాలు