/rtv/media/media_files/2025/09/06/instagram-post-that-took-the-life-of-a-young-man-2025-09-06-13-31-34.jpg)
Instagram post that took the life of a young man
CRIME : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం కిడ్నాపైనా యువకుడు అతి దారుణంగా హత్యగావించబడ్డాడు. మహమ్మద్ బాసిత్ అనే యువకున్ని కిడ్నాప్ చేసిన దుండగులు అతన్ని కార్ లో తీసుకెళ్లి మేడారం అడవుల్లో తాళ్లతో కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు. కాగా మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం కోర్టు నుండి ఇంటికి వస్తున్న బాసిత్ పై బబ్లు, ప్రశాంత్, కుషాల్ తో పాటు మరికొంతమంది కలసి దాడి చేసి కిడ్నాప్ చేశారు. బాసిత్ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తులో భాగంగా మేడారం అడవుల్లో మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చూడండి:Balapur Ganesh Laddu: కోటి ఖర్చైనా పర్లేదు..బాలాపూర్ లడ్డూకు ఈ సారి భారీ పోటీ!
భూపాలపల్లి జిల్లా లోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బాసిత్(20) అనే యువకున్ని ఈ నెల 3న కొంతమంది కిడ్నాప్ చేశారు. అనంతరం అతన్ని కొట్టి కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. విషయం తెలిసిన యువకుని తల్లి సబియా భూపాలపల్లి పట్టణానికి చెందిన బబ్లు, ప్రశాంత్, కుశల్ అనే ముగ్గురు వ్యక్తులు తన కొడుకును కిడ్నాప్ చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే విచారణ చేపట్టిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు బాసిత్ హత్యకు గురైనట్లుగా గుర్తించారు. అతన్ని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన దుండగులు తాళ్లతో చేతులు కట్టేసి విచక్షణ రహితంగా కొట్టినట్లు తేలింది. అనంతరం మేడారం అడవుల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పుపెట్టి సజీవదాహనం చేశారు.
ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!
నిందితులు ఇచ్చిన సమాచారంతో మేడారం అడవుల్లో బాసిత్ మృతదేహాన్ని గుర్తించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారితో పాటు మరో ముగ్గురు కూడా ఈ హత్యలో భాగస్వాములుగా ఉన్నట్లు గుర్తించారు. వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జరిగిన గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
బాసిత్ అభ్యంతరకరమైన మెసెజ్‌లు పెట్టడం మూలంగా గొడవలు జరిగినట్లుగా తెలిసింది. ఈ క్రమంలో తనకు ప్రాణహాని ఉందని బాసిత్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు విచారణ చేపట్టే లోపే ఆ ముఠా అతని వెంటాడి హత్య చేసి కసి తీర్చుకున్నారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడి చేస్తామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి:TG Dasara Holidays: తెలంగాణ స్టూడెంట్స్ కు అదిరిపోయే శుభవార్త.. దసరా సెలవులు ప్రకటించిన సర్కార్.. లిస్ట్ ఇదే