/rtv/media/media_files/2025/09/05/mob-kills-woman-2025-09-05-21-40-13.jpg)
Mob Kills Woman, Injures Husband Over Suspicion Of Blackmagic In Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో దారుణం జరిగింది. పర్సోయి అనే గ్రామంలో భార్యభర్తలు చేతబడి చేస్తున్నట్లు స్థానికులు అనుమానించారు. చివరికి ఇంట్లోకి చొరబడి ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో మహిళ మరణించింది. ఆమె భర్త తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘూతుకానికి పాల్పడ్డ నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్సోయి గ్రామంలో బాబులాల్ ఖర్వార్(57), రాజ్‌వంతి(52) దంపతులు ఉంటున్నారు.
Also Read: అక్షయ్ కుమార్ గొప్ప మనసు.. రూ. 5 కోట్ల విరాళం!
ఈ భార్యాభర్తలు కలిసి తమ గ్రామంలో చేతబడి చేస్తున్నట్లు స్థానికులు అనుమానించారు. దీంతో గురువారం సాయంత్రం గులాబ్ అనే స్థానికుడు మరికొందరు గ్రామస్థులను వెంటబెట్టుకొని ఆ దంపతుల ఇంటికి వచ్చాడు. చేతబడి, మంత్రవిద్యలు చేస్తున్నారనే అనుమానంతో వెంటతెచ్చుకున్న ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో రాజ్‌వంతి అక్కడిక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఆమె భర్త బాబూలాల్ కూడా తీవ్రంగా గాయాలపాలయ్యాడు.
Also Read: వినాయక మండపం వద్ద ఆడుకుంటుండగా 10 ఏళ్ల బాలుడికి గుండెపోటు.. తల్లి ఒడిలోనే
సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మహిళను హత్య చేసిన నిందితుడు గులాబ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. మరోవైపు బాబులార్ ఖర్వార్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇదిలాఉండగా చేతబడి అనుమానాలతో జరుగుతున్న హత్యలు ఎన్నోఏళ్లుగా కొనసాగుతున్నాయి. చేతబడి అనేది ముఢనమ్మకం అనే అవగాహన లేక చాలామంది ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. గ్రామాల్లోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
Also Read: వీడియో - ముసలోడే కానీ మహా రసికుడు.. 65ఏళ్ల మహిళతో తోటలో పాడుపని - చివరికి
ఇదిలాఉండగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఓ కోతుల గుంపు రెండేళ్ల పాపను లాక్కెళ్లి చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సీతాపూర్ అనే గ్రామంలో ఓ ఇంట్లోకి కోతులు ప్రవేశించాయి. అదే సమయంలో నిద్రపోతున్నరెండేళ్ల పాపను గాయపరుస్తూ, లాక్కెళ్లాయి. చివరికి ఇంటిపైన ఉన్న నీళ్ల డ్రమ్ములో పడేశాయి. దీంతో ఆ చిన్నారి మృతి చెందింది.