BIG BREAKING: అమెరికాలో హై టెన్షన్.. ట్రంప్ సన్నిహితుడి దారుణ హత్య!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం యూత్ ఆర్మీని తయారు చేసిన వ్యక్తి, ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన చార్లీ కిర్క్ హత్య కు గురైయ్యారు. ఉటావ్యాలీ యూనివర్శిటీలో మాట్లాడుతుండగా ఓ దుండగుడు కాల్చి చంపాడు. 

New Update
kirk

అమెరికాలో ట్రంప్ వ్యతిరేకులు రెచ్చిపోయారు. ఆయనకు అత్యంత క్లోజ్ అయిన చార్లీకిర్క్ ను హత్య చేశారు. ఉటా వ్యాలీ యూనివర్శిటీలో విద్యార్థులతో మాట్లాడుతుండగా దుండగుడు తుపాకీ తో కాల్చి చంపేశాడు. తీవ్ర గాయాలైన చార్లీని ఆసుపత్రికి తరలించగా..అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మాస్ షూటింగ్స్ పై చర్చ కోసం వెళ్ళిన చార్లీ అదే షూటింగ్ లో చనిపోవడం దురదృష్టకరం. కిర్క్ మెడ భాగంలో నిందితుడు తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ తగలగానే ఆయన కుప్పకూలిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. నిజానికి ఉటా వ్యాలీ యూనివర్సిటీలో తన కార్యక్రమానికి హాజరవడానికి వస్తున్న చార్లీ ఎంట్రన్స్ లోనే  వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కిర్క్‌ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ 1000 మంది సంతకాలతో కూడిన  ఫిర్యాదు యూనివర్సిటీకి ఇచ్చారు. అయితేతాము భావ ప్రకటన స్వేచ్ఛకు, నిర్మాణాత్మక చర్చలకు మద్దతు ఇస్తామని, కార్యక్రమాన్ని రద్దు చేయలేమని యూనివర్శిటీ చెప్పడంతో కిర్క్ సమావేశం కొనసాగింది. 

తీర్చలేని లోటు..

తన సన్నిహితుడు మృతి చెందడంపై అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతితో పాటూ విచారాన్ని వ్యక్తం చేశారు. చార్లీ గొప్ప వ్యక్తి అంటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కిర్క్‌ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవనతం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలో యువతను కిర్క్ కంటే బాగా అర్ధం చేసుకున్నవారు ఎవరూ లేరని ట్రంప్ చెప్పారు. ఎన్నికల సమయంలో కూడా  తన కోసం యూత్ ఆర్మీని తయారు చేశాడని..వారే తన గెలుపుకు దోహదం అయ్యారని తెలిపారు.  టర్నింగ్‌ పాయింట్‌ యూఎస్‌ఏ యూత్‌ ఆర్గనైజేషన్‌ సీఈవో, సహ వ్యవస్థాపకుడిగా చార్లీ కిర్క్ ఉన్నారు. 

చార్లీ కిర్క వయసులో కూడా చాలా చిన్నవారు. ప్రస్తుతం ఆయన వయసు 31 ఏళ్ళు మాత్రమే. కేవలం 23 ఏళ్ళ వయసులో కిర్క్ రాజకీయాల్లోకి వచ్చారు. అంతేకాదు అధ్యక్షుడు ట్రంప్ కు చాలా దగ్గరయ్యారు కూడా. అమెరికాో మాగా ఉద్యమానికి కిర్క్ వారధిగా నిలిచారు. మొదట నుంచీ ఈయన యువతపై ఫోకస్ ఎక్కువగా చేశారు. వారిని దృష్టిలో పెట్టుకుని అధ్యక్ష ఎన్నికల్లో పని చేశారు.  ఆకర్షణీయమైన సమావేశాలు, ఇన్ ఫ్లుయెన్సర్ పైప లైన్, డిజిటల్ కార్యకలాపాలతో ప్రభుత్వానికి మిలయన్ డాలర్లు వచ్చేల చేశారు. 

Advertisment
తాజా కథనాలు