Mahesh Chandra Ladda: హిడ్మా మృతిపై అధికారిక ప్రకటన!
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల అగ్ర నేతల్లో ఒకరైన హిడ్మా మృతి చెందినట్లు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల అగ్ర నేతల్లో ఒకరైన హిడ్మా మృతి చెందినట్లు తెలిపారు.
విజయవాడ సమీపంలోని కానూరు ప్రాంతంలో మావోయిస్టుల సంచారం కలకలం సృష్టించింది. ఈ ప్రాంతంలో సుమారు 10 మంది మావోయిస్టులు రహస్యంగా సమావేశమయ్యారనే విశ్వసనీయ సమాచారం NSG అధికారులకు అందింది.
ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. అందులో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లా తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నారం మరిమల అడవుల్లో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరో 51 మంది మావోలు పోలీసులకు లొంగిపోయారు. వీళ్లలో 9 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా 71 మంది మావోలు పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్లలో కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది.
మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్నలొంగుబాటు నేపథ్యంలో పార్టీ నాయకత్వం చేస్తున్న ప్రచారాన్ని మాజీ నేత తక్కళ్లపల్లి వాసుదేవరావు ఎలియాస్ ఆశన్న ఖండించారు. సాయుధ పోరాటాన్ని విరమించాలని కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే తాము లొంగిపోయినట్లు స్పష్టం చేశారు.
మావోయిస్టుల మూకుమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత, ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.200 మంది మావోయిస్టులతో కలిసి ఆయన సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని ప్రచారం.
దశాబ్ధాల మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు చేరుకుంది. గడచిన కొన్ని రోజులుగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆఫరేషన్ కగార్ నేపథ్యంలో కేంద్ర కమిటీ సభ్యులు అనేకమంది మృత్యువాత పడ్డారు. తాజాగా పలువురు నాయకులు లొంగిపోవడంతో ఉద్యమంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.