/rtv/media/media_files/2025/11/05/maoist-killed-2025-11-05-18-26-34.jpg)
Maoist Killed
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లా తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నారం మరిమల అడవుల్లో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టడంతో ఇరువురి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
Also Read: షాకింగ్ వీడియో: నదిలో భక్తుల పడవ బోల్తా.. అరుపులు కేకలతో గందరగోళం
భద్రతా బలగాలు ఘటనాస్థలం నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఈ కాల్పుల్లో మావోయిస్టుల మృతిపై పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలాఉండగా గత కొన్ని రోజులుగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతున్న సంగతి తెలిసిందే. మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న ఆశన్న, మల్లోజుల, వేణు గోపాల్ రావు లాంటి వారు కూడా ఇటీవల లొంగిపోయారు.
Also Read: నడి రోడ్డుపై దేశ అధ్యక్షురాలికి లైంగిక వేధింపులు.. వీడియో వైరల్
వచ్చే ఏడాది మార్చి 26 నాటికి మావోయిస్టు లేకుండా చేస్తామని గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి దండకారణ్యంలో భద్రతా బలగాలు.. మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య చాలాసార్లు కాల్పులు జరిగాయి. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు కాల్పుల్లో మృతి చెందారు. దీంతో గత కొన్నిరోజుల నుంచి మావోయిస్టులు దశల వారీగా లొంగిపోతూ వస్తున్నారు.
Follow Us