/rtv/media/media_files/2025/03/29/APJtJcXF4Fq9zbUczJA1.jpg)
Maoists encounter Photograph: (Maoists encounter )
Six Maoists killed In Encounter In Chhattisgarh
మావోయిస్ట్ పార్టీ మరో ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా ఆ పార్టీ అగ్రనేతలు లొంగిపోవడం, ఎన్‌కౌంటర్‌కు గురవుతున్నారు. ఈక్రమంలో ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్(bijapur) జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్(maoists-encounter) జరిగింది. మంగళవారం మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు.
భద్రతా బలగాలు చనిపోయిన మావోయిస్టుల నుంచి ఆటోమెటిక్ ఆయుధాలు, ఇన్సాస్, స్టెన్ గన్, 303 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో మద్దెడు ఏరియా కమిటీ ఇన్‌ఛార్జి బుచ్చన్న, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు పాపారావు భార్య ఊర్మిల ఉన్నారు. సెంట్రల్ కమిటీ మెంబర్ పాపారావు తప్పించుకున్నారు.
Also Read : కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే.. కీసరలో యజమానిని దారుణంగా కొట్టిన హిజ్రాలు!
Also Read : నెల్లూరులో లారీ బీభత్సం.. ముగ్గురు దుర్మరణం! (వీడియో)
Follow Us