/rtv/media/media_files/2025/11/19/fotojet-2025-11-19t132559675-2025-11-19-13-26-42.jpg)
Police arresting Maoists
Maoists: 'అర్బన్ నక్సల్స్'.. ఇటీవల కాలంలో ఈ పేరు బలంగా వినిపిస్తోంది. అదేంటి మావోయిస్టులు అడవుల్లో కదా ఉండేది... అలాంటిది అర్బన్ నక్సల్స్ అంటారేంటి అన్న అనుమానం అందరికీ రావొచ్చు. ఇటీవల కాలంలో నక్సల్ తలదాచుకుంటున్న అడవులన్నిటినీ భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. కనిపించిన వారిని కాల్చిపారేస్తున్నాయి. నక్సల్స్‌ను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని మరీ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో అడవుల్లో భద్రతా దళాలను తట్టుకోలేక బలహీనపడ్డ మావోయిస్టులు నగరబాట పడుతున్నారు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున నక్సల్స్ లొంగిపోయిన సంగతి తెలిసిందే. అలాగే మిగిలిన వారు కూడా గుట్టుచప్పుడు కాకుండా నగరాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నక్సల్స్ సానుభూతిపరులు వీరికి అండగా నిలుస్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీలోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో 50 మందికి పైగా నక్సల్స్‌ను పోలీసులు పట్టుకోవడం సంచలనంగా మారింది.
Also Read: తన వాళ్ల కోసమే బ్రతికే మగ మహానుభావులందరికి హ్యాపీ మెన్స్ డే!!
50 మందికి పైగా అరెస్ట్..
విజయవాడ, కాకినాడ, అల్లూరి, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరులో మావోయిస్టుల ఉనికి కలకలం రేపింది. ఆపరేషన్ కగార్‌తో వరుస ఎన్​కౌంటర్లు, మావోయిస్టు అగ్రనేతల మృతితో ఛత్తీస్‌గఢ్ నుంచి కొంతమంది మావోయిస్టులు ఏపీలోకి వచ్చారన్న సమాచారంతో కొంతకాలంగా పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఏకకాలంలో ఏపీలోని అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇప్పటి వరకు విజయవాడలో 28, కాకినాడలో 2, ఏలూరులో 15 మందిని మిగతా ప్రాంతాల్లో మరికొంత మందితో కలుపుకుని మొత్తంగా రాష్ట్రంలో 50 మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేశారు. అలానే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు డంప్‌ల కోసం గాలింపు కొనసాగుతోంది.
Also Read: శబరిమలలో ఏపీ భక్తులపై అమానుషం! ..ప్యాంట్ జిప్ విప్పి
కూలీల పేరుతో మకాం..
విజయవాడలో సుమారు 28 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకోగా వారిని ప్రశ్నించేందుకు రహస్య ప్రాంతాలకు తరలించారు. మరో ప్రత్యేక వాహనంలో పేలుడు పదార్థాలు, తుపాకులను తరలించారు. మొత్తం భవనాన్ని కొత్త ఆటోనగర్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు జరిపారు. భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల్లో 21 మంది మహిళలు, మరో ఏడుగురు కీలక హోదాల్లోని మావోయిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు. పది రోజుల క్రితం ఈ ప్రాంతానికి మావోయిస్టులు వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనుల కోసం వచ్చామని, అద్దెకు ఉంటామని మావోయిస్టులు ఈ భవనంలో చేరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఏలూరు శివారులోని గ్రీన్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఓ భవనంలో 15 మంది మావోయిస్టులను స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఒడిశాకు చెందిన వీరంతా గత వారం రోజులుగా గ్రీన్‌సిటీలో తలదాచుకున్నట్టు అనుమానిస్తున్నారు.
Also Read: పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి.. బాబా జీవితం వసుదైక కుటుంబం..
వీరు ఏలూరులో ఎంత కాలంగా ఉంటున్నారు? ఈ ప్రాంతాన్నే షెల్టర్ జోన్‌గా ఎందుకు ఎంచుకున్నారు? ఏలూరు జిల్లా పరిధిలో ఇంకా ఎంతమంది మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒక్కసారిగా పదుల సంఖ్యలో మావోయిస్టులు పట్టుబడటంతో ఏపీలో హై అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు సోదాలు జరుపుతున్నారు.
Follow Us