/rtv/media/media_files/2025/11/24/maoists-writes-letter-2025-11-24-18-43-31.jpg)
Amit Shah’s deadline to end Naxalism looming, Maoists writes letter
గత కొన్నిరోజులుగా మావోయిస్టులు దశలవారీగా పోలీసులకు లొంగిపోతూ వస్తున్నారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ వల్ల ఇప్పటికే చాలామంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వచ్చే ఏడాది మార్చిలోగా మావోయిస్టులు లేకండా చేయాలని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మావోయిస్టులు లొంగిపోతూ వస్తున్నారు. అయితే తాజాగా వాళ్లు మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆయుధాలు వదిలేందుకు తమకు సమయం కావాలని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం ఇస్తే లొంగిపోతామని పేర్కొన్నారు.
అప్పటిదాకా కూంబింగ్ ఆపరేషన్లను నిలిపివేయాలని కోరారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న ఆపరేషన్లను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టులు లేఖ రాశారు. కూంబింగ్ ఆపరేషన్‌ను ఆపేస్తే తాము ఆయుధాలు వదిలేసే తేదీని కూడా ప్రకటిస్తామని పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట ఈ లేఖను విడుదల చేశారు.
Also Read: భారత నౌకాదళంలోకి INS మహీ.. దీని ప్రత్యేకత ఇదే
ఆ లేఖలో ఇలా రాసుంది. '' మా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ, పొలిటీ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సమర్థిస్తూ MMC స్పెషల్ జోనల్ కమిటీ ఆయుధాలు విడిచిపెట్టాలని భావిస్తోంది. ఫిబ్రవరి 15 వరకు సమయం కావాలి. ఈ గడువు ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. ఈ సమయం కోసం ఇతర ఉద్దేశాలు మాకు లేవు.
ఆయుధాలు వదిలేయాలన్న నిర్ణయంపై సహచరులను సంప్రదిస్తాం. అందరి ఆమోదం పొందేందుకు కాస్త సమయం పడుతుంది. మాకు ఈ విషయం గురించి సహచరులకు చెప్పేందుకు వేరే మార్గాలు లేవు. అందుకే సమయం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ సమయంలో PLGA వారోత్సవాలతో పాటు మిగతా కార్యకలాపాలన్నింటినీ నిలిపివేస్తాం. కూంబింగ్ ఆపరేషన్లు వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాలను కోరుతున్నామని'' మావోయిస్టులు లేఖలో రాసుకొచ్చారు.
Also Read: గ్రామానికి రాజకీయ అధిపతి సర్పంచ్..విధులు ఏంటో తెలుసా?
Follow Us