/rtv/media/media_files/2025/12/08/fotojet-2025-12-08t070921284-2025-12-08-07-10-20.jpg)
10 Maoists surrender in Madhya Pradesh
Maoists Surrender: మధ్యప్రదేశ్(madya pradesh)లో మావోయిస్టులకు షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా మావోయిస్టుల లొంగుబాటు(maoists surrendered to police) నేపథ్యంలో బాలాఘాట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 10 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో లొంగిపోయారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపుమేరకు దేశవ్యాప్తంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటు బాట పట్టారు. అందులో భాగంగానే మధ్యప్రదేశ్‌కు చెందిన సీపీఐ(మావోయిస్టు) పార్టీకి చెందిన మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా భొర్సాదేవ్ ఏరియా కమిటీ సభ్యులని, వారిపై మొత్తంగా రూ.2.36 కోట్ల రివార్డు ఉన్నట్లు అధికారులు చెప్పారు.
Also Read : మాజీ సీఎం జగన్‌కు బిగ్‌షాక్.. బీజేపీలోకి విజయసాయి?
Maoists Continue To Surrender
కాగా లొంగిపోయిన మావోయిస్టులు ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లు సహా అత్యాధునిక ఆయుధాలను అప్పగించినట్లు వివరించారు. లొంగిపోయిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని మండలా జిల్లాతోపాటు సరిహద్దు ప్రాంతాలైన మహారాష్ట్రలోని గోండియా జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధా జిల్లాలో వీరంతా మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు వివరించారు. కాగా వీరి లొంగుబాటుతో డిండోరీ, మండలా జిల్లాలు మావోయిస్టుల ప్రభావం నుంచి పూర్తిగా బయట పడినట్లు సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విధించిన లక్ష్యానికి అనుగుణంగా మధ్యప్రదేశ్‌ను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. లొంగిపోయిన వారిలో సుందర్ అలియాస్ కబీర్ అలియాస్ సోమా, రాకేశ్ ఓడో అలియాస్ బీమా, సమర్ అలియాస్ సమ్రూ అలియాస్ రాజు,సలితా అలియాస్ సవిత, విక్రమ్ అలియాస్ హిడ్మా, లాల్‌సింగ్ మాడవి అలియాస్ సీంగూ, శిల్ప, జరీనా అలియాస్ జోగి, జయశీల, నవీన్ అలియాస్ హిడ్మా తదితరులు ఉన్నారు.
Also Read : బీఎల్‌సంతోష్ వార్నింగ్.. దారికొచ్చిన ధర్మపురి
Follow Us