Manipur: మణిపూర్ లో కాల్పులు ..10 మంది మిలిటెంట్లు హతం
మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో నిన్న అస్సాం రైఫిల్స్ యూనిట్‌తో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో నిన్న అస్సాం రైఫిల్స్ యూనిట్‌తో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో అధికారులు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న తుపాకీలు, రూ.21 లక్షలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
మణిపూర్‌లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అందులో పలువురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారినుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేస్తున్నారు. బిష్ణుపూర్ జిల్లా నింగ్‌థౌఖోంగ్, కాక్చింగ్ జిల్లా హియాంగ్లాంలో టెర్రరిస్టులు పట్టుబడ్డారు.
మహారాష్ట్రని మరో మణిపూర్‌లా మార్చాడమే BJP ప్లాన్ అని శివసేన లీడర్ ఆదిత్య ఠాక్రే అన్నారు. నాగ్‌పూర్ హింసపై ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నడిపించడం చేతకాకుంటే BJP హింస, అల్లర్లు సృస్టింస్తుందని ఆరోపించారు. BJP ప్రతి చోటా ఇదే ఫార్ములా ఫాలో అవుతుందన్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కొడుకు జైషాగా నటించి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామని మోసాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం నిందితులను ఢిల్లీ నుండి ఇంఫాల్‌కు తీసుకువచ్చారు.
మణిపుర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న వేళ.. అమిత్ షా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి 8 నుంచి రాష్ట్రంలో అన్ని మార్గాల్లో ప్రజల రాకపోకలు స్వేచ్ఛాయుతంగా జరిగేలా చూడాలన్నారు. ఎవరైనా ఆటంకం కలిగిస్తే వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు.
మణిపుర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక ప్రకటన చేశారు. ప్రజలు తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను 7 రోజుల్లోగా అప్పగించాలని కోరారు. నిర్ణీత సమయం దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన వేళ దారుణం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాను జరిపిన కాల్పుల్లో తోట జవాన్లు ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.