Manipur: మణిపుర్‌పై కీలక అప్‌డేట్.. రాష్ట్రపతి పాలన పొడిగింపు

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. రాష్ట్రపతి పాలనను కేంద్రం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

New Update
Presidents Rule Extended For Six Months In In Manipur Effective From August 13

Presidents Rule Extended For Six Months In In Manipur Effective From August 13

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. రాష్ట్రపతి పాలనను కేంద్రం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 13 నుంచి ఇది అమలు కానుంది. మళ్లీ 6 నెలల పొడిగింపుతో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సభ కూడా ఆమోదం తెలిపింది.  

Also Read: రాజస్థాన్ లో దారుణం.. కూలిన స్కూల్ బిల్డింగ్..నలుగురు మృతి

ఇదిలాఉండగా 2023 మే నుంచి మెయిటీ, కూకీ జాతుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తింది. చివరికి ఈ ఏడాది ఫిబ్రవరి 13న బీరెన్‌ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మణిపూర్‌ సీఎం ఎవరనేదానిపై బీజేపీ మంతనాలు జరిపింది. కానీ ఎవరికి సీఎం బాధ్యతలు అప్పగించాలనే దానిపై స్పష్టత రాలేదు. ఈ క్రమంలోనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.

Also Read: ఇందిరాగాంధీ రికార్డ్ ను బద్దలు కొట్టిన మోదీ..అత్యంత ఎక్కువ టైమ్ ప్రధానిగా..

మణిపూర్‌లో 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2027తో అక్కడ శాసనసభ కాలపరిమితి ముగియనుంది. అయితే గత 21 నెలలుగా అక్కడ అల్లర్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగా మారాయి. అయితే ఇటీవల జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ అల్లర్లు మొదటలైనప్పటి నుంచి జరిగిన హింసాత్మక ఘటనలో ఇప్పటిదాకా 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.  

Advertisment
తాజా కథనాలు