Manipur: మణిపూర్‌కు ప్రధాని మోదీ వరాల జల్లు.. రూ.8500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరిగిన అల్లర్ల తర్వాత ప్రధాని మోదీ అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో ఆ నిరసనలో మృతి చెందిన బాధిత కుటుంబాలను మోదీ పరామర్శించారు. అలాగే రూ. 8500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి శంకు స్థాపన చేశారు.

New Update
Modi

Modi

దేశ ప్రధాని మోదీ ప్రస్తుతం మణిపూర్ పర్యటనలో ఉన్నారు. మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరిగిన అల్లర్ల తర్వాత ప్రధాని మోదీ అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. 2023లో అల్లర్లు జరగ్గా రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటిస్తున్నారు. మెయితీలకు రిజర్వేషన్ ఇవ్వాలని, ఆదివాసీ తెగలు ఇవ్వద్దని  నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల్లో దాదాపుగా 250 మంది మృతి చెందారు. ఈ బాధిత కుటుంబాలను ప్రధాని మోదీ పరామర్శించారు. అయితే ప్రధాని మోదీ నేటి నుంచి 15వ తేదీ వరకు మిజోరం, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.

ఇది కూడా  చూడండి: Manipur : మోదీకి బిగ్‌ షాక్‌...మణిపూర్‌ పర్యటన వేళ..43 మంది మూకుమ్మడి రాజీనామా?

రూ.8500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు..

ఈ క్రమంలో నేడు మిజోరం నుంచి తన పర్యటనను ప్రారంభించారు. నేడు మోదీ రూ. 8500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి.. శంకు స్థాపన చేశారు. అక్కడ బైరాబి సైరాంగ్ కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించారు. అలాగే గౌహతిలో భూపేన్ హజారికా 100వ జయంతి వేడుకలను, కోల్‌కతాలో జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. అయితే మణిపూర్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న రాష్ట్రం. ఇక్కడ కనెక్టివిటీ ఎల్లప్పుడూ ఉండాలని కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత చురచంద్‌పూర్‌లో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించే కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ఈ క్రమంలో మణిపూర్ ధైర్యసాహసాలకు నిలయం అని అన్నారు. అలాగే భారీ వర్షాలు ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ధన్యవాదాలు తెలిపారు. 

ఇది కూడా  చూడండి: Narendra Modi : దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలి: ప్రధాని మోడీ

Advertisment
తాజా కథనాలు