/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో సుదీర్ఘ కాలంగా అమలులో ఉన్న రాష్ట్రపతి పాలన(president rule) ను రద్దు చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్రమంగా మెరుగుపడుతుండటంతో మళ్ళీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించే దిశగా కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : వారికి గుడ్ న్యూస్.. విదేశాల నుంచి 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు
Ministry of Home Affairs today issued a notification announcing the revocation of President’s Rule in Manipur with immediate effect. pic.twitter.com/GZNE61aeAW
— ANI (@ANI) February 4, 2026
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో, మణిపూర్‌లో ఆర్టికల్ 356 కింద విధించిన రాష్ట్రపతి పాలనను తక్షణమే ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. మణిపూర్‌లో పరిస్థితులు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, ఎన్నికైన ప్రభుత్వం పాలన సాగించడానికి అనువైన వాతావరణం ఉందని కేంద్రం భావిస్తోంది.
రాష్ట్రపతి పాలన ఎత్తివేతతో మణిపూర్‌లో మళ్ళీ రాజకీయ సమీకరణాలు వేగవంతమయ్యాయి. గతంలో జాతుల మధ్య జరిగిన ఘర్షణల వల్ల అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికి కేంద్రం నేరుగా పాలనను తన చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు ఆ ఆంక్షలు తొలగిపోవడంతో, ఎన్నికైన ముఖ్యమంత్రి,మంత్రుల మండలి మళ్ళీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
Also Read : ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్
బీరేన్ సింగ్ రాజీనామా తర్వాత
గతేడాది ఫిబ్రవరిలో బీరేన్ సింగ్ రాజీనామా తర్వాత రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎత్తివేసింది. రాష్ట్రంలో మళ్ళీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మణిపూర్ తదుపరి ముఖ్యమంత్రిగా మాజీ స్పీకర్, సీనియర్ నేత యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఎంపికయ్యారు.
Follow Us