PM Modi : మోదీ మణిపూర్ పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే!

ఎట్టకేలకు ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 13 అంటే రేపే మణిపూర్ రాష్ట్రంలో మోదీ పర్యటించనున్నారు.  2023లో మణిపూర్‌లో జాతి హింస ప్రారంభమైన తర్వాత ఆయన మొదటి పర్యటన ఇదే.

New Update
modi pm

ఎట్టకేలకు ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 13 అంటే రేపే మణిపూర్ రాష్ట్రంలో మోదీ పర్యటించనున్నారు.  2023లో మణిపూర్‌లో జాతి హింస ప్రారంభమైన తర్వాత ఆయన మొదటి పర్యటన ఇదే. ఈ పర్యటనలో భాగంగా ఆయన మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో మధ్యాహ్నం 12:30 గంటలకు రూ. 7,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ. అనంతరం అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.  

Also Read : MIRAI VFX: కార్తిక్ ఘట్టమనేని టెక్నికల్ బ్రిలియన్స్ అరాచకం ..ఈ విజువల్స్ చూస్తే గూస్ బంప్స్ అంతే!

ఈ పర్యటనలో భాగంగా ఆయన మెయిటీలు అధికంగా ఉండే ఇంఫాల్, కుకీలు అధికంగా ఉండే చురాచంద్‌పూర్ జిల్లాలను సందర్శించనున్నారు.  మణిపూర్‌తో పాటు, మిజోరం, అస్సాం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలను కూడా ప్రధాని సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన పశ్చిమ బెంగాల్,  బీహార్‌కు వెళతారు. మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

2023 మే నెలలో ప్రారంభమైన ఈ అల్లర్లలో 260 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పటి నుండి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఈ పర్యటనతో మణిపూర్‌లో శాంతి స్థాపనకు కొత్త ఆశలు చిగురించవచ్చని పలువురు భావిస్తున్నారు. కాగా రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని పర్యటించకపోవడంపై ప్రతిపక్షాలు రెండేళ్లకు పైగా విమర్శలు గుప్పిస్తున్నాయి.

Also Read :  Nepal: నేపాల్‌లో ఉద్రిక్తతలు.. ఏపీకి చెందిన యాత్రికుల బస్సుపై దాడులు

ప్రస్తుతం రాష్ట్రపతి పాలన

ఇక మణిపూర్‌లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. ఇది 2025 ఫిబ్రవరి 13న అక్కడ రాష్ట్రపతి పాలన  విధించబడింది. 2023 మేనుండి రాష్ట్రంలో కొనసాగుతున్న జాతి హింస కారణంగా  ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన మొదట ఆరు నెలల పాటు కొనసాగుతుంది. అవసరమైతే పార్లమెంట్ ఆమోదంతో దీనిని ప్రతి ఆరు నెలలకోసారి పొడిగించవచ్చు.

మణిపూర్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను ఆగస్టు 13, 2025 నుండి మరో ఆరు నెలలు పొడిగించారు.రాష్ట్రంలో కొనసాగుతున్న ఘర్షణలు, రాజకీయ అనిశ్చితి కారణంగా సాధారణ పాలన సాధ్యం కావడం లేదు. అందువల్ల, గవర్నర్ కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర పరిపాలనను పర్యవేక్షిస్తున్నారు.కొన్ని నివేదికల ప్రకారం, ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్ మరియు ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌తో సమావేశమై రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నారు. అయితే, ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 

Also read :  Kanchana 4 Update: లారెన్స్ "కాంచన 4"పై క్రేజీ అప్‌డేట్.. ఈసారి బొమ్మ దద్దరిల్లాల్సిందే!

Advertisment
తాజా కథనాలు