/rtv/media/media_files/2026/02/04/maharashtra-2026-02-04-20-14-18.jpg)
మణిపూర్(manipur) రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ(bjp) సీనియర్ నేత యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్(Khemchand Singh) ప్రమాణ స్వీకారం చేశారు. ఇంపాల్‌లోని లోక్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మణిపూర్‌లో గత ఏడాది ఫిబ్రవరి నుండి అమల్లో ఉన్న రాష్ట్రపతి పాలనను కేంద్రం ఉదయాన్నే రద్దు చేయడంతో, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
రాష్ట్రంలో నెలకొన్న జాతుల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు బీజేపీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా కేబినెట్‌ను కూర్చింది. బీజేపీ ఎమ్మెల్యే నెమ్చా కిప్గెన్ మణిపూర్ చరిత్రలోనే తొలి కుకీ మహిళా డిప్యూటీ సీఎంగా వర్చువల్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) నేత లోసి దిఖో రెండో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మంత్రులుగా గోవిందాస్ కొంతౌజం (BJP), ఖా లోకెన్ (NPP) కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read : కేంద్ర హోం శాఖ సంచలనం.. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత!
ఎవరీ ఖేమ్‌చంద్ సింగ్?
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఖేమ్‌చంద్ సింగ్‌కు ఆర్‌ఎస్‌ఎస్ (RSS) నేపథ్యం ఉంది. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు, టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ హోల్డర్. టైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. 2012లో తృణమూల్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, 2013లో బీజేపీలో చేరారు. గతంలో స్పీకర్‌గా, మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న బీరేన్ సింగ్, రాష్ట్రంలో జరిగిన సామాజిక అల్లర్లను అదుపు చేయలేకపోయారనే విమర్శల మధ్య గతేడాది ఫిబ్రవరి 9న తన పదవికి రాజీనామా చేశారు. కుకీ-జో వర్గాలు ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు, ప్రత్యేక పరిపాలనా విభాగం కావాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో శాంతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా బీజేపీ అధిష్ఠానం ఖేమ్‌చంద్ సింగ్‌ను రంగంలోకి దించింది.వికసిత్ భారత్ - వికసిత్ మణిపూర్ లక్ష్యంగా మా ప్రయాణం సాగుతుంది. సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజలందరి సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ఖేమ్‌చంద్ సింగ్ ఫేస్‌బుక్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : వారికి గుడ్ న్యూస్.. విదేశాల నుంచి 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు
Follow Us