Manipur: 2023 అల్లర్ల తర్వాత మొదటిసారి మణిపూర్ కు ప్రధాని మోదీ..ఈరోజే

దాదాపు రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన కు వెళుతున్నారు. 2023లో అక్కడ జరిగిన గొడవలు..తర్వాత పరిస్థితుల కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలను ఆయన కలవనున్నారు. దాంతో పాటూ రూ. 8500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

New Update
PM Modi

PM Modi

రెండేళ్ల క్రితం మణిపూర్ లో జాతి హింస చెలరేగింది. మైతీలు, కుకీల మధ్య తలెత్తిన వివాదాలు ఎన్నో ప్రాణాలు బలి తీసుకున్నాయి. దీని తర్వాత అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. జాతి హింస చెలరేగి...కొన్ని నెలల పాటూ సాగింది. దీంతో అక్కడి జరగాల్సిన ఎన్నో పనులు ఆగిపోయాయి.

2023 తర్వాత ఇదే మొదటిసారి..

ఇప్పుడు 2023లో మణిపూర్‌లో జాతి హింస ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీమొట్టమొదటిసారిగా మణిపూర్ ను పర్యటిస్తున్నారు. ఈరోజు 12.30 గంటలకు మణిపూర్ లోని చురచంద్ పూర్ లో 8500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తర్వాత అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఇదంతా అయ్యాక ప్రధాన మోదీమైతీలు అధికంగా ఉండే ఇంఫాల్...కుకీలు అధికంగా ఉంటే చురాచంద్ పూర్ జిల్లాలను సందర్శిస్తారు. అక్కడ గొడవల్లో ప్రాణాలు పోగొట్టుకున్న బాధితుల కుటంబాలను పరామర్శిస్తారు. దీంతో పాటూమిజోరం, అస్సాం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలను కూడా ప్రధాని సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన పశ్చిమ బెంగాల్, బీహార్‌కు వెళతారు. మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

2023 ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన..

2023 నుంచి మణిపూర్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఇక్కడ 2023 మే నెలలో ప్రారంభమైన అల్లర్లలో 260 మందికి పైగా మరణించారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. అల్లర్ల తర్వాత జాతి హింస కారణంగా ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన మొదట ఆరు నెలల పాటు కొనసాగుతుంది. అవసరమైతే పార్లమెంట్ ఆమోదంతో దీనిని ప్రతి ఆరు నెలలకోసారిపొడిగించవచ్చు. ఈ విధానం ప్రకారం అక్కడ పరిస్థితులు చక్కబడకపోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన కొనసాగిస్తూనే ఉన్నారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర పరిపాలనను పర్యవేక్షిస్తున్నారు.

Also Read: Asia Cup: దాంతో మాకు సంబంధం లేదు..మా దృష్టి ఆటపైనే..పాకిస్తాన్ మ్యాచ్ లపై మౌనం వీడిన భారత్

Advertisment
తాజా కథనాలు