Layoffs: ఐటీ ఉద్యోగులకు ఊహించని షాక్.. ఆ ప్రముఖ కంపెనీలో 25 వేల మంది ఔట్!
ప్రముఖ చిప్ తయారీ సంస్థ అయిన ఇంటెల్ కూడా ఆర్థిక సమస్యల వల్ల 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటెల్లో 1,08,900 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇంటెల్ భావిస్తోంది.