/rtv/media/media_files/2025/04/14/OQhDFwK9IhFiIthKDZ7w.jpg)
Dr. Reddy’s Laboratories to Lay Off Up to 400 Employees in Cost-Cutting Drive
ఈమధ్య ఐటీరంగంలో లేఆఫ్స్ పెరిగిపోయాయి. చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు తమ సిబ్బందిని తొలగిస్తున్నాయి. అయితే ఇప్పుడు లేఆఫ్స్ ఫార్మా రంగాన్ని కూడా తాకాయి. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం డా. రెడ్డీస్ లాబొరెటీస్ కూడా ఉద్యోగులను తొలగించనుంది. ఈ కంపెనీ 25 శాతం వరకు ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఖర్చులు తగ్గించడం కోసం ఎక్కువ శాలరీలు పొందుతున్న ఉద్యోగులను రాజీనామా చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
Also read: అయ్యో బిడ్డలు.. తెలంగాణలో పెను విషాదం.. కారులో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారుల మృతి!
ఆ కంపెనీలో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 25 శాతం మందిని తొలగించాలని డా.రెడ్డీస్ లాబొరెటీస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కంపెనీ సీనియర్ స్థాయి ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరినట్లు పేర్కొన్నాయి. ఇందులో ఏటా రూ.కోటికి పైగా వేతనాలు అందుకునేవారు కూడా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఆర్ అండ్ డీ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కూడా 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్నవారు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు .. స్పందించిన ప్రధాని మోదీ
మొత్తనికి ఈ కంపెనీలో 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం చూసుకుంటే ఈ ఫార్మా కంపెనీకి మార్కెట్ క్యాప్ సుమారు రూ.92 వేల కోట్లుగా ఉంది. ఏప్రిల్ ప్రారంభంలో ఆదాయపు పన్ను కమిషనర్ హైదరాబాద్ విభాగం నుంచి ఈ కంపెనీ.. రూ.2395 కోట్లకు సంబంధించి డిమాండ్ నోటీసు అందుకుంది. 2022లో ఈ సంస్థ చేపట్టిన విలీన ప్రక్రియపై ఎందుకు ట్యాక్స్ వేయకూడదో చెప్పాలని ఐటీ అధికారులు నోటీ పంపించారు. మరోవైపు ఈ లేఆఫ్స్‌పై డా.రెడ్డీస్ మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు.
Also read: 'జాగ్రత్త.. మీ వాట్సాప్ హ్యాక్ అవ్వొచ్చు'.. కేంద్రం హెచ్చరిక
rtv-news | layoffs | pharma