12వేల మందికి TCS బిగ్ షాక్.. ఉగ్యోగులను తట్టాబుట్టా సర్దుకోమ్మన్న కంపెనీ

ప్రముఖ టెక్‌ దిగ్గజం TCS  రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2శాతం ఉద్యోగులను అంటే దాదాపు 12000 మందిని పైగా తొలగించనుంది. భవిష్యత్తు పరిణామాలకు తమ సంస్థను మరింత దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్‌ సీఈవో కె.కృతివాసన్‌ తెలిపారు.

New Update
TCS lays off

TCS lays off

ప్రముఖ టెక్‌ దిగ్గజం TCS  భారీగా ఉద్యోగాలను తొలగించేందుకు రెడీ అవుతోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2026 ఏప్రిల్‌ నుంచి కంపెనీలో 2శాతం ఉద్యోగులను అంటే దాదాపు 12000 మందిని పైగా తొలగించనుంది. సాంకేతిక రంగంలో శరవేగంగా చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు పరిణామాలకు తమ సంస్థను మరింత దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ టీసీఎస్‌ సీఈవో కె.కృతివాసన్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఉద్యోగాల కోత నిర్ణయం అన్ని దేశాల్లోని టీసీఎస్‌ విభాగాల్లో అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. టీసీఎస్‌లో జూన్‌తో ముగిసిన తాజా త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 6,13, 000గా ఉంది. అందువల్ల 2శాతం ఉద్యోగాల తగ్గింపు నిర్ణయంతో దాదాపు 12,200 మందిపై ప్రభావం పడనుంది. 

లేటెస్ట్ టెక్నాలజీ ఏఐ, ఆపరేటింగ్‌ మోడల్‌ మార్పులను గుర్తిస్తున్నట్లు కృతి వాసన్ చెప్పారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏఐని వినియోగిస్తామని ఆయన అన్నారు. భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను ఎవాల్యుయేట్‌ చేస్తున్నాం. మా ఉద్యోగులకు కెరీర్‌ వృద్ధి, విస్తరణ అవకాశాలను ఎలా అందించగమనే విషయంలో చాలా పెట్టుబడి పెట్టాం. కానీ,  కొన్ని రోల్స్‌లో ఇది అంత ప్రభావవంతంగా జరగలేదని మేం గుర్తించాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 2శాతం మందిపై ప్రభావం చూపుతుందని కృతిసనన్ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు