TCS: టీసీఎస్‌లో లేఆఫ్‌లు.. వాళ్లకి పరిహారంగా 2 ఏళ్ల జీతం

ఈ ఏడాది జులైలో టీసీఎస్‌ 12 వేల మందికి తొలగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా లేఆఫ్‌ల ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఎక్కువకాలం తమ సంస్థలో పనిచేసినవాళ్లకి దాదాపు రెండు సంవత్సర వేతనాన్ని పరిహారంగా చెల్లించనుంది.

New Update
TCS

TCS

ఈ ఏడాది జులైలో టీసీఎస్‌ 12 వేల మందికి తొలగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా లేఆఫ్‌ల ప్రక్రియను ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), ఆటోమేషన్ రాకతో ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. అయితే ఎక్కువకాలం తమ సంస్థలో పనిచేసినవాళ్లకి దాదాపు రెండు సంవత్సర వేతనాన్ని పరిహారంగా చెల్లించనుంది. అలాగే మూడు నెలల నోటీసు పీరియడ్ ఇచ్చి.. ఆ 3 నెలల వేతనం కూడా చెల్లించనుంది. దీనికి అదనంగా ఆరు నెలల నుంచి 2 ఏళ్ల వరకు వేతనాన్ని పరిహారం కింద అందించనుంది. 

Also Read: కండలు పెంచే ఆఫర్.. రూ.379లకే జిమ్ ఐటెమ్స్ - అమెజాన్‌ చంపేసింది బాబోయ్..!

టీఎసీఎస్‌లో తాజాగా లేఆఫ్‌లలో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లలో 8 నెలలకు మించి బెంచ్‌పై ఉన్న వాళ్లకి సింప్లర్‌ ప్యాకేజీ మాత్రమే చెల్లిస్తారు. దీని అర్థం నోటీసు పీరియడ్ వేతనాన్ని మాత్రమే చెల్లిస్తారు. కంపెనీలో10 నుంచి 15 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన వాళ్లకు ఏడాదిన్నర వేతనాన్ని పరిహారంగా అందిస్తారు. ఇక 15 ఏళ్లు దాటినవారికి గరిష్ఠంగా 2 ఏళ్ల వేతనాన్ని అందిస్తారు. వీటితో పాటు అదనంగా ఔట్‌ప్లేస్‌మెంట్ సేవలు ఉంటాయి. 

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో మరో కొత్త సేల్ మావా.. గూగుల్ ఫోన్‌పై రూ.25వేల భారీ తగ్గింపు..!

అంతేకాదు అవసరమైన వాళ్లకు TCS కేర్స్‌ ప్రోగ్రామ్ కింద మానసిక ఆరోగ్యానికి సంబంధించి చికిత్స లేదా థెరపీ సేవలు అందిస్తారు. అలాగే రిటర్మైంట్‌కు దగ్గరపడ్డ వాళ్లకు ముందస్తు పదవీ విరమణ వరకు TCS ఛాన్స్ కల్పిస్తోంది. వీళ్లకు 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు వేతనాన్ని పరిహార ప్యాకేజీ కింద చెల్లిస్తారు. అలాగే బీమా ప్రయోజనాలు కూడా అందిస్తారు. 

Also Read: వెళ్ళిపోండి..లేకుంటే తీవ్రవాదులుగా పరిగణన..గాజా ప్రజలకు ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక

Advertisment
తాజా కథనాలు