/rtv/media/media_files/2025/07/02/microsoft-to-lay-off-2025-07-02-20-57-41.jpg)
ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వేలాది మందికి లేఆఫ్ నోటీసులు జారీ చేస్తునట్లు ప్రకటించింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఇంత భారీగా స్థాయిలో ఉద్యోగుల తొలగింపు చేయడం ఇది రెండోసారి. ఎంత మందిని తొలగిస్తామనే దానిపై ఆ సంస్థ స్పష్టత ఇవ్వలేదు. దాదాపు 4 శాతం కంటే తక్కువ ఉద్యోగులపై ప్రభావం చూపనుందని తెలిపింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం దాదాపు 9 వేల మందికి లేఆఫ్‌లు ఇచ్చినట్లు సమాచారం.
జూన్ 2024 నాటికి 2.28 లక్షల మంది ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులను మొదలుపెట్టిన టెక్ దిగ్గజం.. ఈ ఏడాది మే నెలలో 6 వేల మందికి లేఆఫ్‌లు ప్రకటించింది. తాజాగా మరోసారి పెద్దఎత్తున తొలగింపునకు సిద్ధమైంది. తాజా నిర్ణయంతో మొత్తం సిబ్బందిలో నాలుగు శాతం.. అంటే దాదాపు 9100 మంది ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్లు అంచనా.