Layoffs: ఇక 40 ఏళ్లు వస్తే ఉద్యోగం ఊస్ట్.. షాకింగ్ ప్రకటన!

ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో లేఆఫ్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో 40 ఏళ్లు దాటిన ఉద్యోగులనే ముందుగా తొలగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.దీనిపై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు శంతను దేశ్ పాండే స్పందించారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Employees in 40s now top layoff targets, warns Bombay Shaving Company CEO

Employees in 40s now top layoff targets, warns Bombay Shaving Company CEO

40 ఏళ్లు వచ్చాక ప్రతీ ఒక్కరి జీవితం కీలకంగా ఉంటుంది. ఉద్యోగుల్లో ఆ వయసు ఉన్నవాళ్లు ఎంతో అనుభవం వస్తుంది. అలాగే ఎక్కువ జీతాలు, పదోన్నతులు అందుకునే  దశ కూడా అదే. ముఖ్యంగా ఆ సమయంలో పిల్లల పై చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం డబ్బును ఆదా చేయాల్సి ఉంటుంది. అలాంటి టైమ్‌లో సంపాదన లేకుంటే ఇక ఇళ్లు గడవడం కష్టమే. ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో లేఆఫ్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో  40 ఏళ్లు దాటిన ఉద్యోగులనే ముందుగా తొలగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. 

Also Read: చైనాకు మరో బిగ్ షాక్.. 245 శాతం టారిఫ్‌ విధించిన ట్రంప్‌ సర్కార్

దీనిపై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్ పాండే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇలాంటి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. నలభై ఏళ్ల వయసులోకి అడుగు పెట్టినవారు పిల్లల చదువులు, వృద్ధురాలైన తల్లిదండ్రుల బాధ్యతలు, ఇంటి కోసం చేసిన అప్పులు ఇలా అనేక ఆర్థిక భారాలు మోస్తున్నారని అన్నారు.  ఇలాంటి సమస్యలతో ఇంటిని నెట్టుకొస్తున్న వాళ్లనే కంపెనీలు టార్గెట్‌ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలు పునర్‌వ్యవస్థీకరణ, సిబ్బందిని తగ్గించేందుకు మొదటగా 40లోని ఉద్యోగులనే తొలగించి ఇంటికి పంపిస్తున్నాయని అన్నారు. 

Also read: డాక్టర్లకు తెలియలేదు..కానీ చాట్ జీపీటీ గుర్తుపట్టింది..

ప్రస్తుతం పరిస్థితి ఆందోళగా ఉందని.. ఇలాంటి వయస్సులో ఉద్యోగం కోల్పోవడం అంటే ఆర్థికంగా, మానసికంగా తీవ్ర అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరికలు చేశారు. ఒకవేళ ఇలాంటిది ఏదైనా పరిస్థితి వస్తే తట్టుకునేందుకు మూడు కీలకమైన మనుగడ వ్యూహాలను ఆయన సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాన్ని పెంచుకోవాలని, ఎక్కువగా డబ్బును పొదుపు చేసుకోవాలని, వ్యవస్థాపక మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని సూచనలు చేశారు. అయితే శంతను దేశ్‌ చేసిన వ్యాఖ్యలకు ఆన్‌లైన్‌లో నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. చాలామంది తమ వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటున్నారు. 

telugu-news | rtv-news | layoffs

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు