Meta బిగ్ షాక్..  600 ఉద్యోగులపై వేటు!

టెక్ దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగం, సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ నుండి దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లుగా సమాచారం.

New Update
ai

టెక్ దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగం, సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ నుండి దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది. మెటా తన ఏఐ యూనిట్‌ను మరింత సరళంగా, వేగంగా పనిచేసే విధంగా పునర్‌వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

చీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్ ఉద్యోగులకు పంపిన మెమోలో.. టీమ్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా, నిర్ణయాలు తీసుకోవడానికి తక్కువ చర్చలు అవసరమవుతాయి. ప్రతి ఒక్కరిపై బాధ్యత, ప్రభావం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ తొలగింపుల ప్రభావం ప్రధానంగా ఫేస్‌బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ (FAIR) యూనిట్‌తో పాటు, ప్రొడక్ట్ ఏఐ, ఏఐ మౌలిక సదుపాయాల విభాగాలపై ఉండనున్నట్లు తెలుస్తోంది. 

ఏఐపై పెద్ద ఎత్తున దృష్టి

అయితే, మెటా కొత్తగా ఏర్పాటు చేసిన, అత్యాధునిక ఏఐ మోడల్స్‌పై పనిచేస్తున్న TBD ల్యాబ్ యూనిట్‌పై మాత్రం ఈ కోత ప్రభావం ఉండదని నివేదికలు స్పష్టం చేశాయి. కాగా, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఏఐపై పెద్ద ఎత్తున దృష్టి సారించి, ఈ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, సంస్థ పునర్‌వ్యవస్థీకరణ పేరుతో లేఆఫ్‌లు ప్రకటించడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ తాజా చర్య ఏఐ రేసులో మరింత వేగంగా దూసుకుపోవడానికి మెటా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : Gummadi Narasaiah : గుమ్మడి నర్సయ్యగా స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్!

Advertisment
తాజా కథనాలు