Kolkata Rape Case: పోలీసులు డబ్బులు ఇవ్వాలని చూశారు.. మృతురాలి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు!
కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలిపారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని ఆరోపించారు.