/rtv/media/media_files/2025/07/01/kolkata-gangrape-case-2025-07-01-18-12-56.jpg)
Kolkata Gangrape Case
కోల్‌కతా గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రాపై మరో విద్యార్థిని సంచలన ఆరోపణలు చేసింది. కాలేజీ టూర్‌లో మనోజిత్ మిశ్రా తనను వేధించాడని పేర్కొంది. ఆ సమయంలో తాను నిరాకరించానని.. కానీ అతడు తనను కొట్టాడని తెలిపింది. తనతో అనుచితంగా ప్రవర్తించాడని.. చంపేస్తానని కూడా బెదిరించాడని ఆ బాధిత యువతి తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు చెప్పింది.
Also Read : రైల్వే సూపర్ యాప్.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
Kolkata Gangrape Case
బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం తాను కాలేజీ ట్రిప్‌కు వెళ్లానని బాధితురాలు చెప్పింది. ఆ సమయంలో మనోజిత్ మిశ్రా కూడా వారితో కలిసి వచ్చాడని.. అక్కడ తనను వేధించాడని పేర్కొంది. తాను నిరాకరించినప్పటికీ.. తనను కొట్టాడని.. తన తల్లిదండ్రులను, సోదరిని చంపేస్తానని బెదిరించాడని తెలిపింది.
Days after a woman's gangrape at the South Calcutta Law College created ripples across West Bengal, another student of the institution has accused Monojit Mishra, the prime accused in the case, of allegedly molesting her and threatening her with consequences two years back.… pic.twitter.com/Hy2SNqFhuQ
— IndiaToday (@IndiaToday) July 1, 2025
Also Read : కుమ్ముడే కుమ్ముడు.. రూ.549కే VIVO 5జీ కొత్త స్మార్ట్‌ఫోన్!
పోలీసులను ఆశ్రయించాలని అనుకున్నానని.. కానీ మనోజిత్ మిశ్రా రాజకీయ ప్రభావం కారణంగా మౌనంగా ఉండాల్సి వచ్చిందని ఆ విద్యార్థిని పేర్కొంది. అంతేకాకుండా మనోజిత్ మిశ్రాని కాలేజీ పాలకమండలి అధిపతి, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ దేవ్ రక్షిస్తూ వస్తున్నారని ఆమె ఆరోపించింది.
కాగా మనోజిత్ మిశ్రా దుష్ట చర్యల బారిన పడిన వారిలో తాను ఒక్కదాన్నే కాదని.. దాదాపు 15 మంది బాధిత విద్యార్థులు ఉన్నారని ఆరోపించింది. వీరంతా భయం కారణంగా అతడిపై ఫిర్యాదు చేయలేకపోయారని చెప్పింది. అతడు బహిరంగంగానే మహిళలను బెదిరించేవాడని పేర్కొంది. అతడి వెనుకున్న రాజకీయ బలం వల్ల ఎవరూ ఏమీ చేయలేకపోయేవారని ఆవేదన చెందింది.
Also Read : ముంచుకొచ్చిన కార్చిచ్చు మంటలు.. 50వేల మంది..
Also Read : నటి పాకీజాను ఆదుకున్న డిప్యూటీ సీఎం పవన్ !
kolkata-case | Kolkata law student | kolkata-rape-case