Kolkata Rape Case: కోల్‌కతా బాయ్స్‌ హాస్టల్‌లో విద్యార్థినిపై రేప్.. మత్తుమందు ఇచ్చి ఛీ ఛీ

ఐఐఎం-కలకత్తా బాలుర హాస్టల్‌లో ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కౌన్సిలింగ్ కోసం హాస్టల్‌కు పిలిచి, మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Woman Allegedly Raped Inside IIM-Calcutta Boys Hostel, 1 Arrested

Woman Allegedly Raped Inside IIM-Calcutta Boys Hostel, 1 Arrested

కోల్‌కతాలో మరో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. బాయ్స్ హాస్టల్‌లో ఓ విద్యార్థినిపై రేప్ జరిగింది. మానసికంగా సమస్యల్లో ఉన్న ఓ విద్యార్థినికి కౌన్సిలింగ్ ఇస్తానని చెప్పి అదే కాలేజీ విద్యార్థి హాస్టల్‌కు పిలిపించుకున్నాడు. అనంతరం కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!

మత్తుమందు ఇచ్చి

కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ (IIM-Calcutta)లో ఓ విద్యార్థిని చదువుకుంటోంది. ఆమె గత కొద్ది రోజుల నుంచి మానసికంగా సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అదే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి.. ఆమెకు కౌన్సిలింగ్ చేస్తానని చెప్పాడు. ఇందులో భాగంగానే శుక్రవారం ఆ విద్యార్థినిని బాయ్స్ హాస్టల్‌కు పిలిపించుకున్నాడు. 

Also Read:మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

అనంతరం కూల్‌డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన ఆ విద్యార్థిని మత్తులోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె తనపై రేప్ జరిగినట్లు గ్రహించింది. వెంటనే అతడిని ప్రశ్నించింది. దీంతో ఆ విద్యార్థి ఆమెను బెదిరించాడు. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. 

Also Read:ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!

ఈ ఘటనపై ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు