IIM KOLKATA RAPE CASE: IIM కోల్‌కతా రేప్ కేసులో బిగ్ ట్విస్ట్.. క్రైం స్టోరీని మార్చేసిన తండ్రి ప్రకటన

ఐఐఎం-కలకత్తా విద్యార్థిని కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. తన కుమార్తెపై అత్యాచారం జరగలేదని, ఆమె ఆటోలోంచి పడిపోయి గాయపడిందని తండ్రి తెలిపారు. పోలీసులు తన కుమార్తెను ఆసుపత్రిలో చేర్చారని, ఒక వ్యక్తిని అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు.

New Update
no rape she fell out of an auto father of iim calcutta student

no rape she fell out of an auto father of iim calcutta student

కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) విద్యార్థినిపై జరిగిన రేప్ కేసు తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసులో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇవాళ బాధితరాలు తండ్రి తన కూతురి రేప్ ఇన్సిడెంట్‌పై సంచలన ప్రకటన చేశారు. అతడి ప్రకటన మొత్తం కేసు కథను మార్చేసింది. తన కూతురిపై అత్యాచారం సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించాడు. తన కూతురు ఆటో నుంచి కిందపడిపోయిందని ఆయన తెలిపాడు. 

 IIM KOLKATA RAPE CASE 

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శుక్రవారం రాత్రి 9:34 గంటలకు నాకు కాల్ వచ్చింది. నా కుమార్తె ఆటో నుంచి పడి స్పృహ కోల్పోయిందని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఆమెను SSKS ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో చేర్చారు. ఆమెకు చికిత్స జరుగుతోంది. దీని తర్వాత నేను ఆసుపత్రికి చేరుకుని నా కుమార్తెతో మాట్లాడాను. తనపై ఎలాంటి రేప్ జరగలేదని కుమార్తె చెప్పింది’’ అని ఆ బాలిక తండ్రి మీడియాతో చెప్పాడు. దీంతో ఈ కేసు ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. 

Also Read: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!

ఆ బాలికపై రేప్ జరగకపోతే పోలీస్ స్టేషన్‌లో కేసు ఎందుకు పెట్టాలి? అంటూ చాలా మంది చర్చించుకుంటున్నారు. చూడాలి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.

ఏం జరిగిందంటే?

కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ (IIM-Calcutta)లో ఓ విద్యార్థిని చదువుకుంటోంది. ఆమె గత కొద్ది రోజుల నుంచి మానసికంగా సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అదే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి.. ఆమెకు కౌన్సిలింగ్ చేస్తానని చెప్పాడు. ఇందులో భాగంగానే శుక్రవారం ఆ విద్యార్థినిని బాయ్స్ హాస్టల్‌కు పిలిపించుకున్నాడు. 

Also Read:మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

అనంతరం కూల్‌డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన ఆ విద్యార్థిని మత్తులోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె తనపై రేప్ జరిగినట్లు గ్రహించింది. వెంటనే అతడిని ప్రశ్నించింది. దీంతో ఆ విద్యార్థి ఆమెను బెదిరించాడు. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. 

Also Read:ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!

ఈ ఘటనపై ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు