/rtv/media/media_files/2025/10/16/kolkata-engineering-college-student-rape-accused-classmate-arrested-2025-10-16-07-47-54.jpg)
kolkata engineering college student rape accused classmate arrested
పశ్చిమ బెంగాల్(west bengal)లో విద్యార్థినులపై అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవల దుర్గాపూర్‌లోని ఓ మెడికల్ కళాశాల విద్యార్థిని(medical-college-student) పై సామూహిక అత్యాచారం(sexual-assault) కేసు ఇంకా సద్దుమణగక ముందే.. ఇప్పుడు కోల్‌కతా(kolkata-rape-case)లో అలాంటి ఘటన సంచలనం రేపింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకుని, ఆమె క్లాస్‌మేట్ అయిన యువకుడిని అరెస్టు చేశారు.
Also Read : డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసు.. ఆమె తండ్రి సంచలన నిర్ణయం
మందు తాగించి రేప్
బాధితురాలు చేసిన ఆరోపణల ప్రకారం.. నిందితుడు సెప్టెంబర్ 26 సాయంత్రం 7 గంటల సమయంలో ఆమె అద్దెకు ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చాడు. అక్కడే ఆమెకు ఆల్కహాల్ బలవంతంగా తాగించాడు. ఆ డ్రింక్స్‌లో నిందితుడు మత్తు పదార్థం కలిపాడు. ఆ డ్రింక్స్ తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం నిందితుడు ఆమె అపస్మారక స్థితిని ఆసరాగా తీసుకుని అత్యాచారం చేసినట్లు ఆమె ఆరోపించింది. పరగణాల జిల్లాకు చెందిన ఈ ఇంజనీరింగ్ విద్యార్థిని కోల్‌కతాలో కళాశాలకు హాజరయ్యేందుకు అద్దె ఫ్లాట్‌లో నివసిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో చదువుతున్న బాధితురాలు (20 ఏళ్లు), ఆనందపూర్ పోలీస్ స్టేషన్‌లో తన క్లాస్‌మేట్‌పై ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దీంతో కోల్‌కతాలోని సంతోష్‌పూర్ ప్రాంతానికి చెందిన నిందితుడు రాజ్‌దీప్ రాయ్ సంఘటన తర్వాత కొన్ని రోజులు దాక్కున్నాడు.
అనంతరం ఆనందపూర్‌లోని తన ఇంటికి తిరిగి రాగానే అతడిని అక్టోబర్ 14న పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, అతడికి అక్టోబర్ 22 వరకు పోలీస్ కస్టడీ విధించారు. "మేము దర్యాప్తు ప్రారంభించాము, త్వరలోనే ఈ సంఘటన వివరాలు వెల్లడిస్తాం" అని పోలీసు అధికారి తెలిపారు.
దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఒడిశాకు చెందిన విద్యార్థినిపై అక్టోబర్ 10న క్యాంపస్ బయట సామూహిక అత్యాచారం జరిగిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం రాష్ట్రంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దుర్గాపూర్ కేసులో కూడా ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వరుసగా జరుగుతున్న ఈ అత్యాచార ఘటనలు రాష్ట్రంలో భద్రతా లోపాలను ఎత్తి చూపుతున్నాయి.
Also Read : రెండో భార్యగా ఉంటానంటూ కోట్లు దోచేసింది.. బాధితులు లబోదిబో