Kolkata Rape Case: మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు!

కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందుతుడైన సంజయ్‌రాయ్‌ను ఎట్టకేలకు సీల్దా కోర్టు దోషిగా తేల్చింది.  జనవరి 20న దోషికి శిక్ష విధించనుంది.

New Update
Sanjay Roy

Sanjay Roy

కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ (RG Kar Medical College) లో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం ఘటన (Junior Doctor Rape Case) సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందుతుడైన సంజయ్‌రాయ్‌ను ఎట్టకేలకు సీల్దా కోర్టు దోషిగా తేల్చింది. జనవరి 20న దోషి సంజయ్‌ రాయ్‌ వాదనలు విచారించనుంది. అయితే అదే రోజున దోషికి శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఆగస్టు 9న ఆర్జీకర్‌ మెడికల్‌ కళాశాలలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై.. పోలీస్‌ వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌ రాయ్‌ అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సంజయ్‌ రాయ్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి. 

Also Read :  Maha kumbh melaకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ప్యాకేజీని అందిస్తున్న ఐఆర్‌సీటీసీ

Also Read :  మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు!

Kolkata Junior Doctor Rape Case

దీంతో పోలీసులు సీసీటీవీ కెమెరాల సాయంతో సంజయ్‌ రాయ్‌(Sanjay Rai) ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కేసుపై సీబీఐ విచారణ చేపట్టింది. గత కొంతకాలంగా దీనిపై విచారణ జరుగుతూనే ఉంది. అయితే సీల్దా కోర్టులో ఎట్టకేలకు ఈ కేసుపై సంచలన తీర్పు వెలువరింది. సంజయ్‌ రాయ్‌ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. సెక్షన్స్ 64,66, 103(1) కింద దోషిగా తేల్చింది. జనవరి 20న (సోమవారం) దోషిగా తేలిన సంజయ్‌ రాయ్‌ వాదనలపై విచారించనుంది. అయితే అతడు చెప్పే వాదనలు కోర్టు కొట్టివేస్తే.. అదే రోజు న్యాయస్థానం సంజయ్‌ రాయ్‌కు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నాం..అంతా 20 నిమిషాల్లోనే!

Also Read :  జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. MAAకు మాధవీలత ఫిర్యాదు

మరోవైపు బాధితురాలి తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కోర్టులో జరుగుతున్న విచారణకు సీబీఐ తమను పిలవలేదని చెప్పారు. తమ లాయర్‌ను కూడా కోర్టుకు వెళ్లొద్దని చెప్పారంటూ పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ చేపట్టినప్పటి నుంచి సీబీఐ అధికారులు ఒకట్రెండు సార్లు మాత్రమే తమ ఇంటికి వచ్చారని తెలిపారు. విచారణ ఎంతవరకు వచ్చిందని అడిగితే.. ఇంకా జరుగుతోందని మాత్రమే చెబుతున్నారని తమకు ఎలాంటి వివరాలు చెప్పలేదని వాపోయారు. అయితే చివరకీ కోర్టు సంజయ్‌ రాయ్‌ను దోషిగా తేల్చింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు