Kolkata Rape Case: దేశంలో సంచలనంగా మారిన కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు గురించి సంచలన విషయాలు బయటపెట్టారు మృతురాలి తల్లిదండ్రులు. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని చెప్పారు. ఈ కేసు విచారణలో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును వేగంగా క్లోజ్ చేయడానికి తమకు డబ్బులు ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేశారని అన్నారు. సాక్షాలు తారుమారు చేసేందుకు తమ కూతురు అంతక్రియలు వేగంగా జరిపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Kolkata Rape Case: పోలీసులు డబ్బులు ఇవ్వాలని చూశారు.. మృతురాలి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు!
కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలిపారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని ఆరోపించారు.
Translate this News: