ISRO: ఇస్రో మాజీ ఛైర్మన్ కన్నుమూత!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ ఛైర్మన్ డా.కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు.ఆయన హయంలో ఇస్రో తొలి లూనార్ మిషన్‌కు అడుగులు పడ్డాయి. 9 సంవత్సరాల పాటు ఇస్రో ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ ఛైర్మన్ డా.కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు.ఆయన హయంలో ఇస్రో తొలి లూనార్ మిషన్‌కు అడుగులు పడ్డాయి. 9 సంవత్సరాల పాటు ఇస్రో ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు.
గగన్ యాత్రి వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా నియమితులైన విషయం తెలిసిందే. ఆయన మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నారని కేంద్రం తెలిపింది. దీంతో ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్‌కు వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాన్షు శుక్లా నిలవనున్నారు.
చంద్రునిపై సొంత వ్యోమగామనిని దింపేందుకు భారత్ సిద్ధమవుతోంది 2040 నాటికి జాబిల్లిపై భారత వ్యోమగామి అడుగుపెడతాడని ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ వెల్లడించారు. భారత్‌కు సొంతగా అంతరిక్ష కేంద్రం 2035 నాటికి ఉంటుందన్నారు.
సురక్షితంగా నేలపై దిగిన సునీతా విలియమ్స్‌కు ISRO చైర్మెన్ వీ నారాయణన్ వెల్కమ్ చెప్పారు. ISRO అధికారిక X అకౌంట్లో ఆయన ట్వీట్ చేశారు. పరిశోధనల్లో ఆమె అనుభవాన్ని వినియోగించుకోనున్నట్లు ఇస్రో చైర్మెన్ వెల్లడించారు. ఇదో అసాధారణ అచీవ్మెంట్ అన్నారు.
ఇస్రో శ్రీహరికోట నుంచి చేసిన 100 ప్రయోగంలో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. GSLV-F15 వెహికల్ జనవరి 29న NVS-02 ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. లిక్విడ్ ఇంజన్ స్టార్ట్ అవ్వనందున శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ ఆలస్యం అవుతుందని ఇస్రో తెలిపింది.
ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది.శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్..ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది.
సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇప్పటి వరకు 99 రాకెట్లు పంపిన ఇస్రో జనవరి 29న 100వ రాకెట్ పంపనుంది. 1971లో ప్రారంభమైన శ్రీహరికోట రాకెట్ లాంచ్ 2025 వరకు చేసిన ప్రయోగాల్లో 9 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. ఇస్రో, షార్ ఫుల్ హిస్టరీ కోసం పూర్తి ఆర్టికల్ చదవండి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుసపెట్టి ప్రయోగాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇస్రో సెంచరీకి చేరువైంది. రేపు తన వందో ప్రయోగాన్ని నింగిలోకి పంపనుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో చెప్పింది.