/rtv/media/media_files/2025/05/18/6gXFxrYoj3Cn61iV8PGN.jpg)
ISRO's EOS-9 Satellite Launch Failed
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన పీస్‌ఎల్‌వీ సీ61 ప్రయోగం విఫలమైంది. భూ పరిశీలనకు చెందిన ఈఓఎస్-09 శాటిలైట్ నింగిలోకి వెళ్లిన కాసేపటికే ఈ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగం పూర్తి కాలేదు. మూడో దశ తర్వాత రాకెట్‌లో సమస్య వచ్చిందని.. దీనిపై విశ్లేషణ చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ చెప్పారు.
Also Read: పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!
అయితే ఈఓఎస్-9 శాటిలైట్ బరువు 1,696.24 కిలోలు. దీని జీవితకాలం ఐదేళ్ల వరకు ఉంటుంది. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా భూ ఉపరితల చిత్రాలను అధిక రిజల్యూషన్‌తో తీయగలదు. అలాగే జాతీయ భద్రత, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, వ్యవసాయ, పట్టణ ప్రణాళిక సంబంధిత అంశాలను ఇది రేయింబవళ్లు ఇమేజింగ్ చేయగలదు. 2022లో ప్రయోగించిన ఈఓఎస్-4 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా ఈఓఎస్-9ను ప్రయోగించారు. కానీ అది విఫలమైంది. ఇప్పుడు దీన్ని మళ్లీ ప్రారంభించేందుకు పరిశోధకులు సన్నహాలు చేస్తున్నారు.
Also Read: ఐదేండ్ల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర
అయితే ఒక్కోసారి నింగిలోకి శాటిలైట్లు దూసుకెళ్లినప్పుడు అవి ఫెయిలతే వాటి శిథిలాలు ఎక్కడ పడతాయనేది చాలామందికి ఓ డౌట్ ఉంటుంది. వాస్తవానికి శాటిలైట్ శకలాలు భూమిపైకి పడేలోపే తీవ్ర ఉష్ణోగ్రతలో అవి కాలిపోతాయి. కొన్ని ముక్కలు భూమిపై చేరేలోపే అవి పూర్తిగా ధ్వంసమైపోయి అతిచిన్న ముక్కలుగా విరిగిపోతాయి. వీటివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అలాగే ఈ రాకెట్ ప్రయోగాలు కూడా సముద్రానికి దగ్గర్లోనే చేపడతారు. కాబట్టి జనావాస ప్రాంతాలకు ఎలాంటి ముప్పు ఉండదు.
Also Read: జ్యోతి ఇన్‌స్టాగ్రామ్‌లో షాకింగ్ విషయాలు...పహల్గాం సమాచారం చేరవేత ?
Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి
telugu-news | pslv | rtv-news