/rtv/media/media_files/2025/04/09/3vHbKKqVgNNhh5SEFa9P.jpg)
Indian Astronaut to land On Moon By 2040
చంద్రయాన్ 3 విజయం సాధించిన తర్వాత అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతోంది. ఇప్పుడు ఏకంగా చంద్రునిపై సొంత వ్యోమగామనిని దింపేందుకు సిద్ధమవుతోంది. అయితే 2040 నాటికి జాబిల్లిపై భారత వ్యోమగామి అడుగు పెడతాడని ఆశిస్తున్నామని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డా.జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఓ జాతీయ మీడియా ఏర్పాటు చేసిన రైజింగ్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్‌కు సొంతగా అంతరిక్ష కేంద్రం 'భారత్ స్పేస్ స్టేషన్' 2035 నాటికి ఉంటుందని చెప్పారు.
Also Read: గురుకులాల్లో కోడింగ్ శిక్షణ.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు !
ఇదిలాఉండగా చంద్రయాన్ 3 మిషన్‌లో ప్రజ్ఞాన్ రోవర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రవంపై ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇలా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశగా భారత్ నిలిచింది. అంతేకాదు చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశంగా సరికొత్త రికార్డు సృష్టించింది. మళ్లీ ఇప్పుడు చంద్రయాన్ 4 పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈసారి చంద్రుడి ఉపరితల నమూనాలను భూమిపైకి తీసుకొచ్చేందుకు ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది. 2027లో చంద్రయాన్ 4 ప్రయోగాన్ని చేపట్టనుంది.
Also Read: అమెరికా ఆహారం బంద్..11 దేశాలకు కష్టం!
ఇందులో ఎల్‌వీఎం 3 రాకెట్‌ను రెండుసార్లు ప్రయోగిస్తారు. చంద్రయాన్ 4 మిషన్‌కు సంబంధించిన ఐదు భిన్న భాగాలను నింగిలోకి పంపించి వాటిని కక్ష్యలోనే బిగిస్తారు. అయితే చంద్రుడి పైకి భారత వ్యోమగామిని పంపించేవరకు చంద్రయాన్ ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయని ఇస్రో ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ను వచ్చే ఏడాది చేపట్టనున్నారు.
Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!
chandrayan-3 | isro | space-station | indian-space-station