ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 101వ ప్రయోగం పీఎస్ఎల్వీ 61. ఇది ఈరోజు ఉదయం నింగవిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ సీ61 రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఇది దోహదపడనుంది. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా అవతరించేందుకు, నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెడుతోంది. ఇందులో అమర్చిన సీ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ పగలు, రాత్ర వేళల్లోనే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితలం నుంచి హై రిజల్యూషన్ పిక్చర్స్ ను సేకరించనుంది. ఇప్పటి దాకా వున్న ఈఓఎస్ ఉపగ్రహాల సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్‌ను అమర్చి పంపిస్తున్నారు. భారత ఆర్మీకి ఇది పూర్తి సమాచారాన్ని ఇక మీదట అందించనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఇట్టే పసిగడుతుంది ఈ ఉపగ్రహం.
Also Read : పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!
Also Read : సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారత ఆర్మీ కీలక ప్రకటన
దేశ భద్రతే లక్ష్యం..
ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ గురువారం శార్ కేంద్రానికి చేరుకున్నారు. మిషన్ విజయవంతం కావడమే లక్ష్యంగా శాస్త్రవేత్తల బృందం దశల వారీగా అన్ని వ్యవస్థల తనిఖీలు పూర్తి చేసిన తర్వాత రాకెట్ ను ప్రయోగించారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ఇస్రో ఛైర్మన్ నారాయణన్, “మా అన్ని మిషన్లు దేశ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. మేము ఏ దేశంతోనూ పోటీ పడదలుచుకోలేదు. మా లక్ష్యం ప్రజల, దేశ భద్రతను కల్పించడమే,” అని స్పష్టం చేశారు. ఇస్రో సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన 1979లో భారతదేశం తొలి రాకెట్ ప్రయోగాన్ని చేపట్టినట్టు, అప్పటి SLV-3 మిషన్ 98 శాతం విజయం సాధించిందని చెప్పారు. 1980లో దేశానికి మొదటి విజయవంతమైన ప్రయోగం లభించింది అని కూడా పేర్కొన్నారు.
Also Read : మోదీని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches PSLV-C61, which carries the EOS-09 (Earth Observation Satellite-09) into a SSPO orbit, from Sriharikota, Andhra Pradesh.
— ANI (@ANI) May 18, 2025
EOS-09 is a repeat satellite of EOS-04, designed with the mission objective to ensure remote… pic.twitter.com/4HVMZzXhP0
Also Read : ఒక్క చూపుకే అమ్మాయిలంతా ఫ్లాట్.. కిల్లింగ్ లుక్స్‌లో వైష్ణవ్ తేజ్
today-latest-news-in-telugu | rocket