PSLV C 61 : పీఎస్‌ఎల్వీ సీ 61 రాకెట్‌ ప్రయోగం విఫలం ?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన రాకెట్‌ ప్రయోగం లో సాంకేతిక సమస్య ఏర్పడింది. రెండు దశలను పూర్తి చేసుకున్న రాకెట్‌ మూడవ దశకు చేరుకునేటప్పటికీ  ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో రాకెట్ ప్రయోగం విఫలం అయింది.

New Update
PSLV C 61

PSLV C 61

PSLV C 61:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన రాకెట్‌ ప్రయోగం లో సాంకేతిక సమస్య ఏర్పడింది. రెండు దశలను పూర్తి చేసుకున్న రాకెట్‌ మూడవ దశకు చేరుకునేటప్పటికీ  ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో రాకెట్ ప్రయోగం విఫలం అయింది. కాగా ఈ విషయమై ఇస్రో ఛైర్మన్ నారాయణన్ స్పందించారు. పీఎస్‌ఎల్వీ-సీ 61 రాకెట్‌ ప్రయోగం పూర్తి కాలేదని తెలిపారు. మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. విశ్లేషణ తర్వాత తిరిగి వస్తామని అన్నారు.

ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం

PSLV C61 Rocket Launch Failed

కాగా ఈరోజు ఉదయం ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం చేపట్టింది. పీఎస్‌ఎల్‌వీ - సి 61 రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. భూ పరిశీలనకు చెందిన ఈఓఎస్‌-09(రీశాట్‌-1బి) ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి తీసుకెళ్లింది. రాకెట్‌ ప్రయోగం విజయవంతమవుతుందన్న సమయంలో మూడవ దశలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం విఫలమైనట్లయింది. సరిహద్దుల్లో నిరంతర నిఘా కోసం ఈవోఎస్‌-09 (రీశాట్‌-1బీ) ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అందులో భాగంగా నింగిలోకి తీసుకెళ్లడానికి పీఎస్‌ఎల్వీ-సీ 61 రాకెట్‌ ప్రయోగం జరిగింది. శనివారం ఉదయం 7.59 గంటలకు రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం అవ్వగా.. ఆదివారం ఉదయం 5.59కి నింగిలోకి వెళ్లాల్సింది. కానీ రాకెట్ లాంచ్ చేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో ప్రయోగం విఫలం అయిందని శాస్ర్తవేత్తలు ప్రకటించారు.

ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!

కాగా ఈఓఎస్‌-09 ఉపగ్రహం బరువు 1,696.24 కిలోలు. దీని జీవితకాలం ఐదేళ్లు. ఈ ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. ఎటువంటి సమయంలోనైన భూమి ఉపరితల చిత్రాలను అధిక రిజల్యూషన్‌తో తీస్తుంది. అలాగే జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలను అన్ని సమయాల్లోనూ ఇమేజింగ్‌ చేయనుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన రియల్‌ టైం కవరేజీ అవసరాన్ని పరిష్కరించే లక్ష్యంతో ఈఓఎస్‌-09 కూడా భూ పరిశీలన ఉపగ్రహాల సమూహంలో చేరే అవకాశం ఉంది. ఇది రీశాట్‌-1 ఉపగ్రహానికి తర్వాతి భాగం. ఈ ఉపగ్రహం రిసోర్స్‌శాట్, కార్టోశాట్, రీశాట్‌-2బి సిరీస్‌ ఉపగ్రహాల లాగే డేటా సేకరించి చేరవేయగలదు.2022లో ప్రయోగించిన ఈఓఎస్‌-04 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా దీన్ని నింగిలోకి పంపాలనుకున్నారు.  

ఇది కూడా చూడండి: Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!

Also Read :  బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!

 

isro-chief | isro-next-mission-launch | isro-missions | isro | PSLV-C61 | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు