/rtv/media/media_files/2025/07/07/astronaut-shubhanshu-shukla-calls-isro-chief-from-space-2025-07-07-19-16-41.jpg)
Astronaut Shubhanshu Shukla calls Isro chief from space
యాక్సియమ్-4 స్పేస్ మిషన్ కింద ఇటీవల శుభాంశు శుక్లా బృందం స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఐఎస్‌ఎస్‌లోకి వెళ్లిన తొలి భారతీయ ఆస్ట్రోనాట్‌గా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. అయితే తాజాగా ఆయన అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఛైర్మన్ డా. వి.నారాయణతో ఫోన్‌లో సంభాషించారు. ఈ మిషన్‌కు సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలు, శుభాంశు శుక్లా ఆరోగ్యం, ఇతర అంశాల గురించి వీళ్లు చర్చించారు.
Also Read: అమ్మో.. రామాయణ సినిమాకు రణ్‌బీర్ కపూర్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా ?
Also Read : అమ్మో.. రామయణ సినిమాకు రణ్‌బీర్ కపూర్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా ?
Astronaut Shubhanshu Shukla Calls ISRO
ISSలో నిర్వహిస్తున్న అన్ని పరిశోధనలు, కార్యక్రమాల ప్రాముఖ్యత గురించి ఇస్రో ఛైర్మన్ వి. నారాయణ మాట్లాడారు. అలాగే పలువురు సీనియర్ ఇస్రో అధికారులు కూడా ఈ టెలిఫోన్ చర్చల్లో పాల్గొన్నారు. స్పేష్ స్టేషన్‌లో జరుగుతున్న పరిశోధనలు, సవాళ్లు, పురోగతి విషయాల గురించి శుంభాంశు శుక్లా వారికి వివరించారు. అయితే శుక్లా ఐఎస్‌ఎస్ ప్రయాణానికి వెళ్లేముందు.. ఇస్రో ఛైర్మన్ వి.నారాయణ్‌తో ప్రతిరోజూ మాట్లాడేవారని ఇస్రో తెలిపింది. ఆయన శుక్లాకు సలహాలు, సూచనలు ఇస్తుండేవారని పేర్కొంది.
Also Read: మద్యం మత్తులో రెచ్చిపోయిన ప్రముఖ నేత కుమారుడు.. నటితో అసభ్య ప్రవర్తన
ఇదిలాఉండగా.. యాక్సియం-4 మిషన్ నుంచి నేర్చుకున్న అనుభవాలు త్వరలో భారత్ చేపట్టబోయే గగన్‌యాన్ ప్రొగ్రామ్‌కు ఎంతో దోహదపడనున్నాయి. తక్కువ భూ కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకోసం యాక్సియం-4 మిషన్ అనుభవాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
ఇది కూడా చూడండి:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
isro | Shubhanshu Shukla ISS | Shubhanshu Shukla | rtv-news | telugu-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu