Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. వాళ్లకు వీసాలు బంద్
హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి గాజా ప్రజలకు వీసాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి గాజా ప్రజలకు వీసాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
గాజాలో అల్ జజీరాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులను చంపేసింది ఐడీఎఫ్. వీరిలో ఒకరు హమాస్ ఉగ్రవాదని...అతను జర్నలిస్టుగా నటిస్తున్నాడని ఐడీఎఫ్ వాదిస్తోంది. జర్నలిస్టుల మృతి అల్ జజీరా ఛానెల్ కూడా ధృవీకరించింది.
మనం ఎవరి మాటా వినం కానీ పక్క వాళ్ళకు మాత్రం సలహాలు చెబుతాం. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా అతీతం కాదు. ట్రంప్ ను ఎలా డీల్ చేయాలో భారత ప్రధాని మోదీకి చెబుతానని నెతన్యాహు అనడమే ఇందుకు ఉదాహరణ.
ఇజ్రాయెల్ గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా చేసుకుంది. అక్కడి స్థానిక మీడియా ఈ విషయాలు వెల్లడించింది. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు దశలవారీగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని పేర్కొంది.
హమాస్ ను అంతం చేసే ప్లాన్ లో భాగంగా మొత్తం గాజానే స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు నెతన్యాహు. అయితే దీనిపై ఐడీఎఫ్ తో పాటూ ఇతర ఇజ్రాయెల్ నేతలు, మాజీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. నెతన్యాహును ఆపాలంటూ ట్రంప్ కు లేఖ రాసారు.
హమాస్ వద్ద ఇజ్రాయెల్ బందీలు.. ఇజ్రాయెల్ వద్ద హమాస్ బందీలు ఉన్నారు. అయితే తమ వద్ద నిర్బంధంలో ఉన్న ఇజ్రాయెల్ బందీల పరిస్థితిపై హమాస్ కొన్ని వీడియోలు విడుదల చేసింది.
గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహోమం తెలిసిందే. కాగా పాలస్తీన్లకు యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రెబల్ గ్రూప్ హూతీ మద్దతునిస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌తో వ్యాపారం చేసే వాణిజ్య నౌకలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని హూతీ హెచ్చరించింది.
గాజాలో పెరుగుతున్న ఆకలి మరణాలపై ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కాస్త దిగొచ్చింది. పాక్షిక కాల్పుల విరమణను ప్రకటించింది.