Gaza Peace Plan: గాజా శాంతి ఒప్పందం మొదటి దశపై సంతకం చేసిన ఇజ్రాయెల్ , హమాస్

గాజా శాంతి ఒప్పందం ఎట్టకేలకు అమల్లోకి వచ్చింది. దీని మొదటి దశపై ఇజ్రాయెల్, హమాస్ రెండూ సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. 

New Update
gaza (1)

గాజాలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లో ఎట్టకేలకు కీలక అడుగు పడింది. ఆయన రూపొందించిన శాంతి ప్రణాళిక ఒప్పందంపై చర్చల అనంతరం ఇజ్రాయెల్,హమాస్ లు సంతకం చేశాయి. ఇందులో మొదటి దశకు రెండు వర్గాలు పచ్చ జెండా ఊపాయి. ఈ నిర్ణయంతో హమాస్ దగ్గర బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదల అవుతారు. ఇజ్రాయెల్ కూడా గాజాలోని తన బలగాలను వెనక్కు తీసుకుంటుంది. ఈ విషయం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. తన ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ పెట్టారు. గాజా శాంతి ఒప్పందంలో మొదటి దశకు ఇజ్రాయెల్, హమాస్ లు అంగీకరించినందుకు గర్వంగా ఉంది అటూ ట్రంప్ పోస్ట్ లో రాశారు. అన్ని వర్గాలను సమానంగా చూస్తామని...అరబ్‌, ముస్లిం, ఇజ్రాయెల్‌, ఇతర చుట్టు పక్కల దేశాలకు, అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజని చెప్పారు. ఈ మొత్తం జరగడానికి మాతో పాటూ కలిసి పని చేసిన ఖతార్, ఈజిప్ట్, టర్కీలకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ పోస్ట్ లో పెట్టారు.

మా లీడర్లను కూడా అప్పగించండి..

మొత్తానికి రెండేళ్ళుగా సాగుతున్న యుద్ధానికి తెర పడుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన 21 శాంతి సూత్రాలకు ఇజ్రాయెల్ తో పాటూ హమాస్ కూడా అంగీకారం తెలిపేందుకు ముందుకు వచ్చింది. అంతకు ముందే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దానిని అంగీకరించారు. అయితే ట్రంప్ ప్రతిపాదనకు హమాస్ ఒప్పుకుంది...సంతకం కూడా పెట్టింది. కానీ దానికి తగ్గట్టు కూడా షరతులు పెట్టినట్టు తెలుస్తోంది.  హమాస్ తమ లీడర్లు అయిన యహ్యా సిన్వర్, మహ్మద్ సిన్వర్ మృతదేహాలను అప్పగించాలని కూడా కోరిందని వాల్ స్ట్రీట్ జర్నల్ చెబుతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన బందీలకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేటప్పుడు వారి మృతదేహాలను అప్పజెప్పాలని కోరినట్టు వాల్ స్ట్రీట్ కథనం రాసింది. ఇంతకు ముందు కూడా హమాస్ తమ లీడర్ల మృతదేహాలను అప్పగించాలని కోరింది. కానీ అప్పుడు ఇజ్రాయెల్ తిరస్కరించింది. 

Also Read: UP: కాన్పూర్ లో స్కూటర్లలో పేలుడు..పలువురికి గాయాలు

Advertisment
తాజా కథనాలు