Israel hamas War
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. గాజాపై ఇజ్రాయెల్ మరోసారి బాంబు దాడులతో విరుచుకుపడింది. హమాస్ తమ సైన్యంపై దాడి చేసిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. మరోవైపు ముందు ఇజ్రాయెల్ తమపై దాడి చేసిందని హమాస్ అంటోంది. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఆర్మీ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్లీ ఇలా కాల్పులు జరుపుకోవడం కలకలం రేపుతోంది.
Follow Us