BIG BREAKING: గాజాలో మళ్లీ చెలరేగిన హింస.. పారుతున్న రక్తం.. 50 మంది హతం?

ఇజ్రాయెల్ , హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇక మీదట రక్తపాతం ఉండదని అనుకున్నారు అందరూ. కానీ హమాస్ మాత్రం ఇంకా ఊచకోత కోస్తూనే ఉంది. ఇజ్రాయెల్ గూఢచారులనే ఆరోపణలతో డజన్ల మందిని చంపేస్తోంది. 

New Update
gaza

గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇజ్రాయెల్,హమాస్ తమ దగ్గర బందీలుగా ఉన్నవారిని విడిచి పెట్టాయి. హమ్మయ్య ఇక గాజాలో శాంతి నెలకొంటుంది అనుకున్నారు అంతా. కానీ అందరి ఆశలనూ అడియాశలు చేస్తూ..హమాస్ గాజాలో హింసాత్మకంగా ప్రవర్తిస్తోంది. ఇజ్రాయెల్ గూఢచారులనే అనుమానంతో గాజాలో పాలస్తీనియన్లను ఊచకొత కోస్తోంది. వాంతి ఒప్పందం తర్వాత హమాస్ ఇప్పటి వరకు 50మంది చంపింది. ఇజ్రాయెల్‌తో కుమ్మక్కయ్యారనే అనుమానంతో ఆ బృందం డజన్ల కొద్దీ ప్రత్యర్థి మిలీషియా సభ్యులను కాల్చి చంపింది. గాజా అంతర్గత భద్రతను హమాస్ చేపట్టవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇది జరగడం గమనార్హం. 

నడిరోడ్డుపై గన్ తో కాల్చి..

సఫాక్ న్యూస్ నివేదిక ప్రకారం...గాజాలో హమాస్ ఫైరింగ్ స్క్వాడ్ ఎనిమిది మందిని బహిరంగంగా కాల్చి చంపింది. నడి రోడ్డు మీద వారిని మోకాళ్ళ మీద కూర్చోపెట్టి మరీ చంపారు. ఇలా ఇప్పటి వరకు 50 మంది చంపబడ్డారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. చనిపోయిన వారికి ఇజ్రాయెల్ తో సంబంధాలున్నాయని హమాస్ చెబుతోంది. 

అధికారం కోసమే ఇదంతా..

మరోవైపు గాజా నగరం అంతటా హమాస్ తన భద్రతా దళాలను మోహరించింది. పాలస్తీనియన్ హోమ్ ఫ్రంట్ అనే హమాస్ మద్దతుగల టెలిగ్రామ్ ఛానల్ శత్రువుల కోసం గూఢచర్యం చేస్తున్న అనేక మంది "గూఢచారులు, దేశద్రోహులను" అరెస్టు చేసినట్లు చెబుతోంది.  ముసుగులు ధరించిన హమాస్ సిబ్బంది "పోలీస్" టోపీలు ధరించి, రైఫిల్స్‌తో మార్కెట్లలో గస్తీ తిరుగుతున్నట్లు  చాలా వీడియోలు చూపిస్తున్నాయి. దీంతో గాజాలోని శక్తివంతమైన డోగ్ముష్ తెగకు, హమాస్ కు మధ్య పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఇందులో డోగ్ముష్ వంశానికి చెందిన 52 మంది సభ్యులు మరణించగా, సీనియర్ కమాండర్ బాసెం నయీమ్ కుమారుడు సహా 12 మంది హమాస్ యోధులు మరణించారు. దీని బట్టి హమాస్ ఇక మీదట కూడా ఊరుకోదని తెలుస్తోంది. శాంతి ఒప్పందం తర్వాత కూడా హింస చేసే అవకాశం ఉందని అంటున్నారు. గాజాలో తిరిగి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికే హమాస్ ఇలా చేస్తోందని చెబుతున్నారు. హమాస్ ఈ చర్యల వలన ప్రస్తుతం గాజాలో భయం నెలకొందని..అందరూ తమ ఇళ్ళల్లో తలుపులు మూసుకుని భయంతో ఉండిపోయారని తెలుస్తోంది.  

Also Read: Stock Market: చాలా రోజుల తర్వాత..లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Advertisment
తాజా కథనాలు