Gaza Peace Plan: మొదటి దశ అయింది..చీ ఫో అంది..గాజా శాంతి ప్రణాళికకు హమాస్ నో

 గాజా శాంతి ప్రణాళిక మొదటి దశ ఒప్పందం మీద హమాస్ సంతకం చేసింది. ప్రపంచం అంతా సంతోషించింది. అది నాలుగు రోజులు అయినా అవలేదు..ఇప్పుడు మళ్ళీ తర్వాతి దేశలను ఒప్పుకునేది లేదని మొండికేస్తోంది హమాస్. మాకు అభ్యంతరాలున్నాయని చెబుతోంది. 

New Update
Gaza

Gaza

ఇజ్రాయెల్ , హమాస్ ల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు 21 సూత్రాలతో శాంతి ప్రణాళికను రూపొందించారు. దీనికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. మిగతా ముస్లిం దేశాలు కూడా మద్దతునిచ్చాయి. చివరకు హమాస్ కూడా మొదటి దశకు ఒప్పుకుంది. ఇజ్రాయెల్, హమాస్ రెండూ మొదటి దశ మీద సంతకాలు కూడా చేశాయి. పాపం ట్రంప్ తాను విజయం సాధించానని పండుగ చేసుకున్నారు. ప్రపంచ నేతలందరూ ఆయనకు అభినందనలు తెలిపారు. కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. అది మొదటి దశతోనే ఆగిపోయింది. 

తర్వాతి దశకు నో చెబుతున్న హమాస్...

గాజా శాంతి ప్రణాళికలో బందీలను విడిచి పెట్టడం, ఐడీఎఫ్ ను గాజా నుంచి తరలించడం మొదటి దశ్. దీని తర్వాత కూడా ఇజ్రాయెల్, హమాస్ రెండూ ఒక ఒప్పందానికి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దీన్ని తరువాత దశ కింద విభజించారు. ఇప్పుడు కరెక్ట్ గా ఇక్కడే హమాస్ పట్టుబట్టింది. తాము సంతకం చేయమని భీష్మించుకుని కూర్చుంది. ట్రంప్ రూపొందించిన ప్రణాళికలో తమకు అభ్యంతరాలున్నాయని హమాస్ సీనియర్ నాయకుడు చెబుతున్నారు. మామాస్ నాయకులు గాజా స్ట్రిప్ ను విడిచి పెట్టాలనడం సరైనది కాదని వారు అంటున్నారు. పాలస్తీనియన్లు హమాస్ సభ్యులైనా కాకపోయినా కూడా వారిని వారి దేశం నుంచి బహిష్కరించడం అన్యాయమని ఆరోపిస్తున్నారు. దీనికి ఎంత మాత్రం తాము ఒప్పుకునేది లేదని..తదుపరి చర్చలకు రామని హమాస్ రాజకీయ బ్యూరో సభ్యుడు హోసం బద్రన్ తెగేసి చెప్పారు. తదుపరి దశ చర్చలు కష్టంగా ఉంటాయని తాను భావిస్తున్నానని, ఇందులో "చాలా సంక్లిష్టతలు , ఇబ్బందులు ఉన్నాయి" అని బద్రన్ అన్నారు. అంతకు ముందు మహాస్ నిరాయుధీకరణ అనే ప్రశ్నకు తావు లేదని మరో హమాస్ అధికారి చెప్పారు. ఆయుధాల అప్పగింత అనేది అసలు చర్చనీయాంశం, చర్చించదగినది కాదని అన్నారు. 

మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిడిల్ ఈస్ట్ పర్యటనకు రానున్నారు. గాజాలో నిర్భంధించబడిన బందీల విడుదల సందర్భంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆయనను ఆహ్వానించింది. మరోవైపు కాల్పుల విరమణ కూడా కొనసాగుతోంది. వేలాది మంది పాలస్తీనియన్లు తిరిగి తమ స్వస్థం గాజాకు చేరుకుంటున్నారు. హమాస్‌తో కాల్పుల విరమణను పర్యవేక్షించడానికి దాదాపు 200 మంది అమెరికా సైనికులు ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ దళాలు ఖాళీ చేసిన గాజా ప్రాంతాలపై నియంత్రణను తిరిగి నిర్ధారించడానికి హమాస్ శనివారం తన భద్రతా దళాలలోని దాదాపు 7,000 మంది సభ్యులను కూడా పిలిచింది. ఈ నేపథ్యంలో హమాస్ ఇలా గాజా ఒప్పందం శాంతి ప్రణాళిక తదుపరి చర్చలకు రాననడంతో మళ్ళీ కథ మొదటికి వచ్చిందని అంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు